Tue May 06 2025 09:39:26 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
సభ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది

Claim :
పహల్గామ్ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను రద్దు చేశారుFact :
సభ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించాలనే పోరాటం నుండి 25 సంవత్సరాల కాలంలో జాతీయ పార్టీగా అవతరించిన భారతీయ రాష్ట్ర సమితి(తెలంగాణ రాష్ట్ర సమితి) ఏప్రిల్ 27న రజతోత్సవాన్ని జరుపుకుంటోంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో బహిరంగ సభను నిర్వహించనుంది.
పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కొద్దిమందితో ప్రారంభమైన పార్టీకి ఇప్పుడు 60 దేశాలలో శాఖలు ఉన్నాయి. తెలంగాణలో మాత్రమే 63 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణను పాలించిన పార్టీ, 2023లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. అయితే తదుపరి ఎన్నికల్లో తిరిగి పుంజుకోవాలని ఆశిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చాలా నెలల తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. కృష్ణా జలాల పంపిణీ వివాదంపై ఆయన చివరిసారిగా నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇది ప్రధాన సమావేశం కాబట్టి, రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. "ఉద్యమ పార్టీగా ప్రారంభమైన జార్ఖండ్‌లోని JMM తర్వాత, BRS కి మాత్రమే పార్టీకి ఇది ఒక మైలురాయి. JMM చాలా సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. BRS అధినేత కేసీఆర్‌ను చూడటానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు" అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు తెలిపారు.
ఏప్రిల్ 27న, కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్, హరీష్ రావు లాంటి బడా నేతల స్పీచ్ లను వినడానికి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని భావిస్తున్నారు. పోరాటంలో పుట్టిన పార్టీకి, ప్లీనరీ మరొక అవకాశాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2028 లో ఎలాగైనా మరోసారి విజయం సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. BRS తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని వ్రాయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దాని లక్ష్యంలో అది ఎంతవరకు విజయం సాధిస్తుందో భవిష్యత్తు తెలియజేస్తుంది.
ఇంతలో సభ రద్దు అయిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని న్యూస్ ఛానల్స్ లో పహల్గామ్ ఘటన కారణంగా బీఆర్ఎస్ ప్లీనరీ రద్దు అయిందంటూ నివేదిస్తున్నట్లుగా న్యూస్ క్లిప్పింగ్ వైరల్ అవుతూ ఉంది.

వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
సంబంధిత కీవర్డ్స్ తో మేము గూగుల్ సెర్చ్ చేయగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ రద్దు అయినట్లు ఏ మీడియా సంస్థ కూడా నివేదించలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను వెతికాం. అందులో వైరల్ పోస్టులను ఖండిస్తూ పెట్టిన పోస్టులు మాకు లభించాయి.
"రేపు వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి జడుసుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫేక్ ప్రచారాలకు ఒడిగట్టాయి.
సభపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు లక్షలాది మందితో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో తెలంగాణలో ఈ రెండు జాతీయ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయం.
జై తెలంగాణ
#25YearsOfBRS #BRSat25" అంటూ బీఆర్ఎస్ పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది.

@BRSTechCell అకౌంట్ లో వరంగల్ లో బీఆర్ఎస్ రజతోత్సవ రద్దు అయినట్లు వచ్చిన క్లిప్పింగ్ లను ఖండిస్తూ పోస్టులు పెట్టారు.
మేము బీఆర్ఎస్ నేతలతో ఫోన్ లో మాట్లాడగా సభను రద్దు చేస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. సభకు సర్వం సిద్ధం చేశామని అన్ని ఏర్పాట్లు పూర్తీ చేస్తున్నామని వివరించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనుకున్న సమయానికే జరగనుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభను నిర్వహించనుంది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేశారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటుచేశారు. సభ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. లైట్లు, ఎల్ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. 20/50 సైజుతో కూడిన 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను రద్దు చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : సభ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story