Tue May 06 2025 10:06:43 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: భారత ఆర్మీని ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రజలను డబ్బులు ఇవ్వమని కోరడం లేదు
రోజుకు కేవలం ఒక రూపాయి భారత సైన్యానికి

Claim :
రోజుకు కేవలం ఒక రూపాయి భారత సైన్యానికి ఇవ్వాలని కేంద్రం కోరిందిFact :
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న కార్యకలాపాలు, భద్రతా ఏర్పాట్లను ఆయనకు వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ క్లోజ్డ్ డోర్ సమావేశంలో ఉగ్రవాదులు, వారి సహచరుల ఇళ్లపై దళాలు చేస్తున్న దాడుల గురించి వివరించారు. ప్రధానమంత్రిని కలవడానికి ముందు, రాజ్ నాథ్ సింగ్ సౌత్ బ్లాక్‌ను సందర్శించారు. కశ్మీర్‌లోనూ, పహల్గామ్లో ప్రస్తుత పరిస్థితి గురించి ఆర్మీ చీఫ్ ఆయనకు వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగిన తీవ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరీ స్థానికుడు మరణించారు. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి.
అయితే భారత ఆర్మీకి డొనేషన్స్ అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక్క రూపాయి అయినా పంపించవచ్చని, ఇది బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సూచించారని ఓ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.
"సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించిన విధంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో మంచి నిర్ణయం:*........
రోజుకు కేవలం ఒక రూపాయి, అది కూడా భారత సైన్యానికి. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో, మోడీ ప్రభుత్వం భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి మరియు యుద్ధ ప్రాంతంలో గాయపడిన లేదా అమరవీరులైన సైనికుల కోసం బ్యాంకు ఖాతాను తెరిచింది. దీనిలో ప్రతి భారతీయుడు తనకు నచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వవచ్చు. ఇది రూ.1 నుండి ప్రారంభమవుతుంది మరియు అపరిమితంగా ఉంటుంది.
ఈ డబ్బును సైన్యం మరియు పారామిలిటరీ దళాలకు ఆయుధాలు కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. న్యూఢిల్లీ, *మన్ కీ బాత్, ఫేస్బుక్, ట్విట్టర్ మరియు వాట్సాప్‌లలో ప్రజలు సూచించినట్లుగా, నేటి మండుతున్న పరిస్థితిలో మోడీ ప్రభుత్వం చివరకు ఒక నిర్ణయం తీసుకుంది మరియు కెనరా బ్యాంకులో ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ బాటిల్ క్యాజువాలిటీ ఫండ్ ఖాతాను తెరిచింది. ఇది సినీ నటుడు అక్షయ్ కుమార్ మాస్టర్ స్ట్రోక్. భారతదేశం సూపర్ పవర్ గా మారకుండా ఎవరూ ఆపలేరు. భారతదేశంలోని 130 కోట్ల జనాభాలో 70% మంది కూడా ఈ నిధిలో రోజుకు కేవలం ఒక రూపాయి పెట్టుబడి పెడితే, ఆ ఒక రూపాయి రోజుకు 100 కోట్లుగా మారుతుంది. 30 రోజుల్లో 3000 కోట్లు మరియు ఒక సంవత్సరంలో 36000 కోట్లు. పాకిస్తాన్ వార్షిక రక్షణ బడ్జెట్ రూ.36,000 కోట్లు కూడా కాదు. మనం రోజుకు 100, 1000 రూపాయలు పనికిరాని పనులకు ఖర్చు చేస్తాము, కానీ మనం సైన్యానికి ఒక రూపాయి ఇస్తే, భారతదేశం ఖచ్చితంగా సూపర్ పవర్ అవుతుంది.
బ్యాంక్ వివరాలు:
కెనరా బ్యాంక్
ఖాతా పేరు: ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ యుద్ధ ప్రమాదాలు,
ఎ/సి నెం: 90552010165915
IFSC కోడ్: CNRB0000267
సౌత్ ఎక్స్టెన్షన్ బ్రాంచ్, న్యూఢిల్లీ.
ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి
కొందరు పంపరు కానీ మీరు పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను
జై హింద్. వందేమాతరం."
అంటూ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.
ఈ మెసేజీ కేవలం తెలుగులోనే కాకుండా, పలు భాషల్లో కూడా వైరల్ అవుతూ ఉంది.

వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని మేము నిర్ధారించాం.
భారత సైన్యం వెబ్సైట్లో రెండు బ్యాంకు ఖాతాల వివరాలను మేము కనుగొన్నాము. ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ అంటూ రెండు ఉన్నాయి. ఈ నిధుల ద్వారా వచ్చే విరాళాలను సైనికుల భార్యలు, వారి బంధువులు, ఆధారపడిన వారు, అవసరమైన మాజీ సైనికులకు సంక్షేమం కోసం ఆర్థిక సహాయం అందించడానికి ఉపయోగిస్తారు.
ఆర్మీ, నేవీ, వైమానిక దళం నుండి యుద్ధ మృతుల కుటుంబాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ తరపున ఈ నిధిని భారత సైన్యం నిర్వహిస్తుందని ఆ వెబ్సైట్ పేర్కొంది. వెబ్సైట్ రెండు బ్యాంకు ఖాతాల ఖాతా నంబర్, IFSC, ఇతర వివరాలను కూడా పంచుకుంది.అయితే, వైరల్ పోస్ట్‌లలో పేర్కొన్న ఖాతా నంబర్ సరైనదే అయినప్పటికీ, IFSC, బ్రాంచ్ వివరాలు సరిపోలడం లేదు.

మా తదుపరి పరిశోధనలో, ఈ వైరల్ మెసేజీ విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటనను కూడా విడుదల చేసిందని తేలింది. సాయుధ దళాలను ఆధునీకరించడంలో సహాయపడటానికి ఒక నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు విరాళం ఇవ్వమని ప్రజలను కోరుతూ వాట్సాప్ సందేశాలు నకిలీవని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం, ఆ సందేశంలోని ఖాతా వివరాలు తప్పు అని, అలాంటి మోసపూరిత కార్యకలాపాలని నమ్మవద్దని ప్రజలను కోరింది ప్రభుత్వం.
అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా వైరల్ పోస్టును ఖండించింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) చేసిన నిజ నిర్ధారణలో కూడా ఆ సందేశం నకిలీదని తేలింది. “భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం బ్యాంకు ఖాతాను తెరిచిందని పేర్కొంటూ ఒక వాట్సాప్ సందేశం వైరల్ అవుతూ ఉంది. ఈ వాదన తప్పుదారి పట్టిస్తోంది. సందేశంలో పేర్కొన్న బ్యాంకు ఖాతా భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి లేదా ఆయుధాల కొనుగోలు కోసం ఉద్దేశించినది కాదు” అని PIB తెలిపింది.

వైరల్ అవుతున్న పోస్టులను పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఖండించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : రోజుకు కేవలం ఒక రూపాయి భారత సైన్యానికి ఇవ్వాలని
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story