Tue May 06 2025 09:57:49 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుమారుడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదు
పహల్గామ్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న హపత్ నార్ గ్రామం

Claim :
వైరల్ ఫోటోలో ఉన్నది సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుమారుడుFact :
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాకు పెళ్లి అవ్వలేదు, పహల్గామ్ ఘటన కంటే ముందే ఈ ఫోటో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది
పహల్గామ్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న హపత్ నార్ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. పహల్గామ్ లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో ఏకైక స్థానికుడు అయిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాకు వీడ్కోలు పలికేందుకు వేలమంది వచ్చారు. బైసారన్ వంటి సుందరమైన ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్లడం ద్వారా రోజుకు రూ.300 సంపాదించే రోజువారీ కూలీ అయిన ఆదిల్ సందర్శకులను రక్షించడానికి ప్రయత్నిస్తూ మరణించాడు. దాడి చేసిన వారిలో ఒకరి నుండి రైఫిల్ లాక్కోవడానికి ఆదిల్ తీవ్రంగా ప్రయత్నించాడని ప్రాణాలతో బయటపడిన పర్యాటకులు తెలిపారు.
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అంత్యక్రియల సమయంలో, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా వేలాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలామంది అతడి ధైర్యసాహసాలను కొనియాడారు. “అతను ఉగ్రదాడిని ఆపడానికి ప్రయత్నించాడు. ఒక ఉగ్రవాది నుండి రైఫిల్ లాక్కోవడానికి ప్రయత్నించిన తర్వాత అతనిపై దాడి చేశారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, తాము చేయగలిగినదంతా చేస్తామని హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను” అని అబ్దుల్లా తెలిపారు.
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా బైసరన్‌కు పర్యాటకులను గుర్రంపై తీసుకెళ్లడాన్ని వృత్తిగా మలచుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అద్భుత ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ మినీ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధమైన బైసరన్‌కు రవాణా సదుపాయం లేదు. నడక ద్వారా లేదా గుర్రం మీద ప్రయాణించి మాత్రమే అక్కడకు చేరుకుంటారు. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఎప్పటిలాగే పర్యాటకులను తీసుకుని వెళ్లారు. కానీ ఊహించని ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
ఇంతలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుమారుడు తన తండ్రి పార్థివదేహం వద్ద ఏడుస్తున్నాడంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ వ్యక్తి నుదుటి మీద పిల్లాడు ముద్దు పెట్టడం చూడొచ్చు
ఆ పోస్టులు ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మేము గుర్తించాం
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ పోస్టుకు పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాకు ఎలాంటి సంబంధం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేశాం. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రాణ త్యాగానికి సంబంధించి పలు మీడియా సంస్థలు నివేదించాయి. సయ్యద్ ఆదిల్ షాకు పెళ్లి అయిందని, కుమారుడు ఉన్నాడని ఎవరూ చెప్పలేదు. సయ్యద్ ఆదిల్ షా తండ్రి పేరు సయ్యద్ హైదర్ షా. తమ కుమారుడు చేసిన త్యాగం గురించి తల్లిదండ్రులు ఇద్దరూ స్పందించారు.
వైరల్ పోస్టుకు పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాకు ఎలాంటి సంబంధం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేశాం. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రాణ త్యాగానికి సంబంధించి పలు మీడియా సంస్థలు నివేదించాయి. సయ్యద్ ఆదిల్ షాకు పెళ్లి అయిందని, కుమారుడు ఉన్నాడని ఎవరూ చెప్పలేదు. సయ్యద్ ఆదిల్ షా తండ్రి పేరు సయ్యద్ హైదర్ షా. తమ కుమారుడు చేసిన త్యాగం గురించి తల్లిదండ్రులు ఇద్దరూ స్పందించారు.
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాకు సంబంధించిన పలు కథనాలు లభించాయి. ఎక్కడా కూడా అతడికి కుమారుడు ఉన్నాడని నివేదించలేదు. మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ ఫోటోను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అయితే ఈ ఫోటో పహల్గామ్ ఘటన చోటు చేసుకోకముందే ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని మేము గుర్తించాం.
Muslim's Corner అనే పేజీలో A farewell look and a farewell kiss అనే టైటిల్ తో ఏప్రిల్ 19, 2025న పోస్టు చేశారు.
العرب/Al arab అనే పేజీలో ఏప్రిల్ 8, 2025న పోస్టు చేశారు.
కొన్ని పోస్టులలో గాజా అనే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు.
వైరల్ పోస్టును కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
ఈ వైరల్ పోస్టు ఎక్కడి నుండి వచ్చిందో తెలుగు పోస్ట్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ పహల్గామ్ ఘటన చోటు చేసుకోకముందే ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని మేము గుర్తించాం.
పహల్గామ్ ఘటనలో ప్రాణాలు వదిలిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాకు పెళ్లి అవ్వలేదని సంబంధిత కథనాల ద్వారానూ, ఆయన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ ఆధారంగా మేము గుర్తించాం.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాకు పెళ్లి అవ్వలేదు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story