Tue May 06 2025 12:01:02 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: శౌర్యచక్ర గ్రహీత తల్లిని భారత్ నుండి వెళ్లిపొమ్మన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
వైరల్ పోస్టులను బారాముల్లా పోలీసులు

Claim :
శౌర్యచక్ర గ్రహీత తల్లిని భారత్ నుండి వెళ్లిపొమ్మన్నారుFact :
వైరల్ పోస్టులను బారాముల్లా పోలీసులు ఖండించారు
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని దర్యాప్తు చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి చెందిన 45 మంది సభ్యుల బృందం కశ్మీర్ లోయలో ఉంది. ఇన్స్పెక్టర్ జనరల్ (IG), డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG), సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి సీనియర్ అధికారులు ఈ దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్నారు, వీరిలో ఏడుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు (DSP) కూడా ఉన్నారు. బిసారన్, పహల్గామ్, శ్రీనగర్లకు ఇప్పటికే పలు NIA యూనిట్లు వెళ్లాయి.
పహల్గామ్ ఘటన తర్వాత పలు వీసాల మీద భారత్ కు వచ్చిన పాకిస్థానీలు తిరిగి వెళ్లాలని భారత ప్రభుత్వం సూచించింది. ఏప్రిల్ 24 నుండి ఆరు రోజుల్లో 786 మంది పాకిస్తాన్ జాతీయులు అట్టారి-వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా భారతదేశం నుండి వెళ్లిపోయారని ఒక సీనియర్ అధికారి తెలిపారని ఇండియా టుడే నివేదించింది. అదే సమయంలో, మొత్తం 1376 మంది భారతీయులు పాకిస్తాన్ నుండి అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారు.
అయితే దేశం నుండి పంపించేయాలంటూ కశ్మీర్ అధికార యంత్రాంగం 60 మంది పాకిస్థానీయులతో సిద్ధం చేసిన జాబితాలో, శౌర్యచక్ర అందుకున్న ఓ కానిస్టేబుల్ తల్లి కూడా ఉందని కథనాలు వచ్చాయి. షమీమా అక్తర్ జమ్ముకశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి. ముదాసిర్ 2022లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మరణానంతరం శౌర్యచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2023లో రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో షమీమా అక్తర్ రాష్ట్రపతి నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. షమీమా అక్తర్ స్వస్థలం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అని, అది భారతదేశ భూభాగమేనని ముదాసిర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత 45 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తోంది.
పాకిస్థాన్ కు ఆమెను వెళ్లిపొమ్మన్నారంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు బారాముల్లా పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కనిపించాయి.
అమరవీరుడు కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ తల్లిని తిరిగి పంపించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికలు అవాస్తవం, నిరాధారమైనవి, నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని తెలిపారు.
విధి నిర్వహణలో తన ప్రాణాలను అర్పించి, మరణానంతరం శౌర్య చక్రతో సత్కరించబడిన అమరవీరుడు కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ వారసత్వాన్ని జమ్మూ కశ్మీర్ పోలీసులు గుర్తించారని తెలిపారు. ఆయన త్యాగం జమ్మూ కశ్మీర్ పోలీసులకు, మొత్తం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. ప్రజలు, మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని J&K పోలీసులు కోరుతున్నారని ఆ ప్రకటనలో ఉంది. అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు ఏదైనా సమాచారాన్ని పంచుకునేటప్పుడు అత్యంత బాధ్యత వహించాలని సూచించారు.
ఆ పోస్టులను ఇక్కడ చూడొచ్చు
ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి. కథనాలను ప్రచురించాయి. అమరవీరుడు కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి షమీమా అక్తర్‌ను పాకిస్తాన్‌కు పంపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను బారాముల్లా పోలీసులు తోసిపుచ్చారని నివేదికలు వచ్చాయి. ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంటూ 2022 మేలో ప్రాణాలు వదిలిన కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్య చక్ర లభించింది.
"అమరవీరుడు ముదాసిర్ తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. భారత ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని షమీమా మరిది మొహమ్మద్ యూనస్ కూడా స్పష్టం చేశారు.
ఆ మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, శౌర్యచక్ర గ్రహీత తల్లిని భారత్ నుండి పంపించేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ పోస్టులను బారాముల్లా పోలీసులు
Claimed By : Social Media Users, Media
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media, News Portals
Fact Check : False
Next Story