Wed Dec 10 2025 11:51:22 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: స్క్రిప్టెడ్ వీడియోను నిజంగా చోటు చేసుకున్న మొబైల్ ఫోన్ దొంగతనంగా ప్రచారం చేస్తున్నారు
దొంగతనాలు, దోపిడీలను అరికట్టడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైల్వే స్టేషన్స్ లో

Claim :
వైరల్ అవుతున్న వీడియో రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న దొంగతనానికి సంబంధించిందిFact :
ఈ వీడియో స్క్రిప్టెడ్. నటీనటులతో చిత్రీకరించారు
భద్రతను మెరుగుపరచడానికి, భారతీయ రైల్వేలు కోచ్లు, లోకోమోటివ్లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దుండగుల కార్యకలాపాలు, విధ్వంసం, దొంగతనాలను తగ్గించడం, నేరాలకు వ్యతిరేకంగా పోరాడడం, దర్యాప్తులో సహాయం చేయడం కూడా ఈ చర్యల లక్ష్యం.
దొంగతనాలు, దోపిడీలను అరికట్టడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైల్వే స్టేషన్స్ లో ఏఐ ఆధారిత కెమెరాలను కూడా ప్రవేశ పెడుతున్నారు. AI-ఆధారిత ఫేస్ రికగ్నిషన్ నిఘా వ్యవస్థలు, సాంకేతికత సహాయంతో ప్రజా భద్రతను మెరుగుపరచడానికి కేంద్రం చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఒక భాగం. భద్రత మెరుగుదలతో పాటు, టికెట్ తనిఖీ, బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి AI సాంకేతికతను ఉపయోగించవచ్చు. ప్రయాణీకులు ఎక్కువ సేపు క్యూలలో ఉండకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. రైల్వే స్టేషన్లను స్మార్ట్ స్టేషన్లుగా మార్చే ప్రణాళిక కింద కొత్త సాంకేతికతను తీసుకుని వస్తున్నారు. భద్రత, నిఘా, ప్రయాణీకుల సౌకర్యాలను పెంచడంపై దృష్టి పెడుతున్నారు.
ఓ వ్యక్తి మహిళా ప్రయాణీకురాలి నుండి ఎంతో సులువుగా మొబైల్ ఫోన్ ను దోచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ‘సైలెంట్ గా వచ్చి మొబైల్ కొట్టేసిన దొంగ’ అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
వైరల్ అవుతున్న వీడియో నిజంగా చోటు చేసుకున్న ఘటన కాదు. ఇది నటీనటులతో చిత్రీకరించిన వీడియో.
నిజం ఎంతుందో తెలుసుకోడానికి, వీడియో మూలం కనుగొనడానికి వైరల్ వీడియో లోని కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం.
hey arti_01 అనే అకౌంట్ లో బీహార్ లో మొబైల్ దొంగతనం జరిగింది అంటూ సెప్టెంబర్ 20న ఇదే వీడియోను పోస్టు చేశారు. "Mobile Chori Ho Gaya Bihar train mein " అనే టైటిల్ తో 49 సెకండ్ల నిడివి ఉన్న వీడియోను అప్లోడ్ చేశారు.
ఇక మేము వైరల్ వీడియోను అప్లోడ్ చేసిన పేజీకి సంబంధించిన సమాచారాన్ని కనుగొన్నాం. తాను, తన భర్త కలిసి వీడియోలు చేస్తామని వివరించారు. తాము బీహార్ కు చెందినవారమని వివరించారు.
దీన్ని బట్టి వైరల్ వీడియో నిజమైన సంఘటన కాదని తెలుస్తోంది.
ఇక ఆమెకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా ‘Reel Creator’ అని పేర్కొన్నారు.
ఈ పేజీని పరిశీలిస్తే రైల్లో దొంగతనాలకు సంబంధించిన వీడియోను సృష్టించి పోస్టు చేశారు. ఇది వ్యూస్ కోసం చేస్తున్న పని అని తెలుస్తోంది. చాలా వీడియోలలో దొంగతనం జరిగిపోయినట్లుగా, ఆ తర్వాత తేరుకుని చూసుకున్నట్లుగా కంటెంట్ ను సృష్టించారు. పలు వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మరికొన్ని వీడియోలకు కోట్లలో కూడా వ్యూస్ వచ్చాయి. ఇలాంటి వీడియోలు రైల్వే వ్యవస్థను తప్పుగా చూపించే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే వ్యూస్ కోసం ఏది పడితే అది చేసే కంటెంట్ క్రియేటర్లను కట్టడి చేసే వ్యవస్థలు రావాల్సి ఉందని పలువురు నెటిజన్లు ఇలాంటి వీడియోల కింద కోరుతూ ఉన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలకు, ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియోలకు చిన్న పాటి గీత ఉంటుందనే విషయాన్నీ కంటెంట్ క్రియేటర్లు గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూడానూ!!
నవంబర్ 25, 2025న కూడా లక్షల రూపాయల మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నట్లుగా స్క్రిప్టెడ్ వీడియోను పోస్టు చేశారు.
కాబట్టి, నటీనటులతో సృష్టించిన వీడియోను నిజమైన వీడియోగా భావించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : వైరల్ అవుతున్న వీడియో రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న దొంగతనానికి సంబంధించింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost Fact Check
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story

