ఫ్యాక్ట్ చెక్: రోడ్డు ప్రమాదం ఘటనకు సంబంధించిన గొడవను మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు
పహల్గాం ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ మరణించారు. ఈ ఘటనపై ముస్లింలు, కశ్మీరీలను నిందించొద్దు అని ఆయన భార్య

Claim :
ఉత్తరాఖండ్లో ఒక ముస్లిం కుటుంబాన్ని ఇతరులు పేరు అడిగి కొట్టారు.Fact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఒక రోడ్డు ప్రమాదం తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది
పహల్గాం ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ మరణించారు. ఈ ఘటనపై ముస్లింలు, కశ్మీరీలను నిందించొద్దు అని ఆయన భార్య హిమాన్షీ నర్వాల్ ఇటీవల కోరారు. ఆమె మీద కూడా ట్రోలింగ్ చేశారు. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుబడుతూ ట్రోల్ చేయడం సరికాదని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత ఆమె భార్య హిమాన్షీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ దురదృష్టకరమని తెలిపింది. పహల్గామ్ ఘటన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.
ఇంతలో, డెహ్రాడూన్లో వివాహానికి వెళుతున్న ముస్లిం కుటుంబంపై అతని పేరు అడిగి దాడి చేశారని రక్తంతో పూర్తిగా తడిసిన వ్యక్తి వీడియోను వైరల్ చేస్తున్నారు. హిందీలో పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. “డెహ్రాడూన్, ఉత్తరాఖండ్: బంజారావాలాలో వివాహ వేడుకకు వెళ్తున్న ముస్లిం కుటుంబంపై 5-6 మంది వ్యక్తులు ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేశారు. వారి పేరు మరియు మతాన్ని అడిగిన తర్వాత దుండగులు వారిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. #alleyesonindianmuslims” అని అందులో ఉంది.