Tue May 06 2025 09:34:06 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: 2021 మే నెల నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు
ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడిలో పహల్గామ్ ఘటన ఒకటి. పహల్గామ్లోని బైసరన్ పచ్చిక

Claim :
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైనికులపై భారత సైనికులు కాల్పులు జరుపుతున్నట్లు చూపుతోన్న వైరల్ వీడియోFact :
ఈ వీడియో పాతది, మే 2021 నుండి ఆన్లైన్లో ఉంది.
ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడిలో పహల్గామ్ ఘటన ఒకటి. పహల్గామ్లోని బైసరన్ పచ్చిక బయళ్లలో ఒక ఉగ్రవాదుల బృందం పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మంది అమాయకులను చంపింది. లష్కరే తోయిబాతో లింక్స్ ఉన్న థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ మారణహోమానికి బాధ్యత వహించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ తీవ్రవాద సంస్థ ఏర్పడింది. జనవరి 2023లో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) TRFను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదుల నియామకం, చొరబాటు, పాకిస్తాన్ నుండి జమ్మూ కశ్మీర్లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఈ సంస్థ భాగమై ఉందని ప్రభుత్వం తెలిపింది.
సాంకేతిక నిఘా, ప్రత్యక్ష సాక్షులు సహా నిఘా వర్గాల నుండి విశ్వసనీయ సమాచారంతో పహల్గామ్ లో మారణహోమం సృష్టించిన హంతకుల గుర్తింపును నిర్ధారించారు. ఈ సంఘటనతో పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత్ నిర్ధారించింది. భారత ప్రభుత్వం సరిహద్దు క్రాసింగ్లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. 1960 నుండి అమలులో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని కూడా భారత్ నిలిపివేసింది.
దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసింది. భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది. పాకిస్తాన్ దళాలు జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వివిధ ప్రదేశాలలో కాల్పులు జరిపాయి. వీటన్నిటి మధ్య, కొంతమంది భారతీయ సైనికులు ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై కాల్పులు జరుపుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొత్తం మూడు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు శత్రు సైన్యానికి గట్టిగా బదులిచ్చిన భారత ఆర్మీ నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు అందుతున్న సమాచారం” అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇటీవల జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియో కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము, ఆ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అనేక సందర్భాల్లో షేర్ చేశారని తెలుస్తోంది. జులై 29, 2024న ఒక సోషల్ మీడియా వినియోగదారుడు “Recent incidents are more than Terrorist attacks and infiltration.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు.
fouji_vlogs_raghu అనే ఫేస్ బుక్ వినియోగదారుడు, అదే వీడియోను ఫిబ్రవరి 2, 2024న “LOC: 81mm mortar firing by indian army in Enemy position #viral #army #punjabi #kisaanandolan” అనే టైటిల్ తో పోస్టు చేశారు.
ఒక యూట్యూబ్ యూజర్ వైరల్ వీడియోతో పాటు వివిధ సైనికుల వీడియోల కోల్లెజ్‌గా నిడివి ఎక్కువ ఉన్న వీడియోను షేర్ చేశారు. 0.26 నిమిషాల నుండి వైరల్ భాగాన్ని మనం చూడవచ్చు.
Jay Wankhade అనే యూట్యూబ్ పేజీలో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను “LoC: 81mm Mortar firing by Indian Army on Enemy Positions” అనే టైటిల్ తో పోస్టు చేశారు. వీడియో వివరణలో "పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు ప్రతీకారంగా భారత సైన్యం స్థానికంగా తయారు చేసిన OFB 81mm మోర్టార్‌ను ఉపయోగించింది. వీడియోలోని మిగిలిన భాగంలో, మీరు 84mm కార్ల్ గుస్తాఫ్ రీకోయిల్ లెస్ (CGRL) షెల్స్ కవర్లను కూడా చూడవచ్చు" అని ఉంది. లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారో, ఎక్కడ జరిగిందో మేము నిర్ధారించలేకపోయినా వైరల్ వీడియో ఇటీవలిది కాదని మేము నిర్ధారించగలము. 2021 సంవత్సరానికి చెందిన వీడియో ఇటీవలిదిగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది.
Claim : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైనికులపై భారత సైనికులు కాల్పులు జరుపుతున్నట్లు చూపుతోన్న వైరల్ వీడియో
Claimed By : X (Twitter) users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story