Tue May 06 2025 13:42:15 GMT+0530 (India Standard Time)
Ice Apple : తాటి ముంజలు వచ్చేశాయి... తినేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి
తాటి ముంజలు వచ్చేశాయి. వేసవిలో తాటి ముంజలు రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.

తాటి ముంజలు వచ్చేశాయి. వేసవిలో తాటి ముంజలు రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. లేత తాటి ముంజలు తింటే ఆ అనుభూతి వేరు. ఆ టేస్ట్ వేరు. పల్లె టూరు నుంచి పట్నం వరకూ ఈ తాటి ముంజల కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంది. పట్టణాల్లో కాస్త ధర ఎక్కువయినా కొనుగోలు చేసి మరీ తాటి ముంజలను తింటారు. తాటిముంజలు తింటుంటే ఆ కిక్కే వేరప్పా అనే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ తరం వారు కూడా తాటి ముంజల పట్ల ఆకర్షితులవుతున్నారంటే దాని రుచి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఎన్నో ప్రయోజనాలు...
వేసవిలో తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు. తాటి ముంజల్లో విటమిన్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రైబో ప్లేవిన్, నియాసిస్, బీ - కాంప్లెక్స్ వంటివి ఉండి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు.అలాగే తాటి ముంజల్లో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. వేసవి కాలంలో లభించే ఈ తాటి ముంజలు తినడానికి ఎంత రుచో ఆరోగ్యానికి కూడా అంత మంచిదని పెద్దలు కూడా చెబుతారు.
డీహైడ్రేషన్ కు గురి కాకుండా...
తాటి ముంజలను ఒలవకుండా తొక్కతో తింటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. వేసవిలో శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకూ నీటిని తాగాలని చెబుతారు. దాని వల్ల శరీరం డీహైడ్రైషన్ కు లోను కాదని వైద్యులు కూడా పదే పదే చెబుతారు. అదే సమయంలో పుచ్చకాయ, తాటి ముంజల వంటివి డీహైడ్రేషన్ కు గురికాకుండా చేయడంలో ముందుంటాయి. మంచిగా పనిచేస్తాయి. శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. తప్పకుండా ఈ వేసవిలో దొరికే తాటి ముంజలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story