Fri Apr 03 2026 18:10:16 GMT+0530 (India Standard Time)
Kerala : కేరళలో షిగేల్లా వ్యాధి కలకలం.. ఈ వ్యాధి లక్షణాలివే
కేరళలోని కోజికోడ్ లో షిగెల్లా వ్యాధి కలకలం సృష్టిస్తుంది

కేరళలోని కోజికోడ్ లో షిగెల్లా వ్యాధి కలకలం సృష్టిస్తుంది. 12 మందికి షిగెల్లా వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధితో ఒక చిన్నారి మృతి చెందారు. ఏ వైరస్ వచ్చినా మొదట కేరళలోనే వెలుగు చూస్తుంది. తాజాగా షిగెల్లా వ్యాధితో చిన్నారులు బాధపడుతున్నారు. ఒక చిన్నారి మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. శరీరంలోకి షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ కావడంతో ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలిలా...
తీవ్రమైన జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు, చెడిపోయిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ఈ వ్యాధి ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చిన్నారుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు.
సర్కార్ అప్రమత్తం..
దీనికి ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత పాటించడం, కాచిచల్లార్చిన నీటిని మాత్రమే తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఈ వైవైరస్ తో పన్నెండు మంది బాధపడుతుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజల్లో చైతన్యం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నారు. కేరళ ప్రస్తుతం షిగెల్లా వ్యాధితో ఇబ్బందులు పడతుండటంతో ఆ ప్రభావం పర్యాటకరంగంపై పడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

