Sun Apr 05 2026 05:45:43 GMT+0530 (India Standard Time)
War Effect : మెడిసిన్స్ పై భారీ ఎఫెక్ట్.. ఈ మందులు పెరగనున్నాయ్
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో మెడిసిన్స్ ధరలు పెంచాయి

పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో మెడిసిన్స్ ధరలు పెంచాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాటి ధరలు రెండు వందల నుంచి మూడు వందల శాతం పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ముడి పదార్థాల వల్ల...
యుద్ధం వల్ల ముడిపదార్థాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో మందుల తయారీ ఖర్చు పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్‌న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి
Next Story

