Fri Apr 03 2026 18:14:29 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి లాంగ్ వీకెండ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 3వతేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు. అలాగే శనివారం కూడా కొన్ని స్కూళ్లకు హాలిడే ఇవ్వనుండగా.. సండే ఎలాగూ సెలవు ఉంటుంది.
మూడు రోజులు వరస సెలవులతో...
ఇక ఐటీ కంపెనీలకు శని, ఆదివారాలు సెలవు ఉంటుంది. దీంతో వరసగా మూడు రోజులు సెలవులు వస్తుండటంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లు, హాలిడే స్పాట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. లాంగ్ వీకెండ్ రావడంతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
Next Story

