Fri Apr 03 2026 18:09:36 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాదీలూ.. అలెర్ట్.. కల్తీ ఆహారం తినే వారికి హెచ్చరిక
హైదరాబాద్ లో ఇటీవల కల్తీ ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి

హైదరాబాద్ లో ఇటీవల కల్తీ ఆహార పదార్థాలు బయటపడుతున్నాయి. ఏ ఆహారపు వస్తువు అయినా అది కల్తీ కాదని మనం చెప్పలేని పరిస్థితి. వంట నూనెలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్.. పాలు.. నెయ్యి.. మాంసం.. ఐస్ క్రీమ్ లు..బిస్కెట్లు.. సమోసాలు..ఇలా అనేక రకాల ఆహార పదార్థాల్లో కల్తీ జరిగినట్లు టాస్క్ ఫోర్స్ తో పాటు ఫుడ్ సేఫ్టే అధికారుల దాడుల్లో బయటపడుతున్నాయి. అందుకే ఇంటి వంటకు మించిన ఫుడ్డు మరొకటి లేదు. జిహ్వ చాపల్యంతో బయట తినాలని వెళితే దొరికిపోతారు. తర్వాత అనారోగ్యం పాలయి ఆసుపత్రుల్లో చేరి భారీ బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
కల్తీ ఆహారంతో...
hహైదరాబాద్ లో ఇటీవల కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ మరియు కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం మన ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. ముఖ్యంగా కుళ్ళిన చికెన్, నాణ్యత లేని నూనెలు వాడటం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోటల్ ఫుడ్ వల్ల కలిగే ప్రధాన అనర్థాలున్నాయని చెబుతున్నారు.
ఫుడ్ పాయిజనింగ్ తో : కుళ్ళిన మాంసంలో 'సాల్మొనెల్లా', 'ఈ-కోలి' వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు మరియు తీవ్రమైన కడుపునొప్పి వస్తాయి.
లివర్ సంబంధిత సమస్యలు : హోటళ్లలో ఒకే నూనెను పదే పదే మరిగించడం వల్ల అందులో కార్సినోజెనిక్ (క్యాన్సర్ కారక) పదార్థాలు తయారవుతాయి. ఇది కాలేయానికి తీవ్ర హాని చేస్తుంది.
జీర్ణక్రియ దెబ్బతినడం : అధిక మసాలాలు, కృత్రిమ రంగులు వాడటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
టైఫాయిడ్, కలరా: అపరిశుభ్రమైన నీరు, నిల్వ ఉంచిన పదార్థాల వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఇంటి భోజనానికే ప్రాధాన్యత : సాధ్యమైనంత వరకు ఇంట్లో తాజాగా వండుకున్న ఆహారాన్నే తీసుకోవడం అత్యుత్తమం.
పరీక్షించి చూడండి : ఒకవేళ బయట తినాల్సి వస్తే, ఆ హోటల్ లేదా రెస్టారెంట్ యొక్క కిచెన్ పరిశుభ్రతను గమనించండి. ఆహారం నుండి వింత వాసన వస్తున్నా, రంగు మరీ ఎక్కువగా ఉన్నా అది కచ్చితంగా నాణ్యత లేనిదే అని గుర్తించాలి.
ప్యాక్డ్ అండ్ ఫ్రెష్ ఫుడ్: నిల్వ ఉంచిన పదార్థాల కంటే అప్పటికప్పుడు వండిన వేడి పదార్థాలనే ఎంచుకోండి.
ఆహార భద్రతకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించండి
Next Story

