Tue Jul 22 2025 03:23:55 GMT+0530 (India Standard Time)
Hydra : హైడ్రాపై నమ్మకం నానాటికీ సన్నగిల్లుతుందా? ట్రాక్ తప్పిందా?
హైడ్రా పనితీరుపై ప్రశంసలు ఎంత స్థాయిలో వినిపించాయో.. అదేస్థాయిలో విమర్శలు కూడా వినవస్తున్నాయి.

హైడ్రా పనితీరుపై ప్రశంసలు ఎంత స్థాయిలో వినిపించాయో.. అదేస్థాయిలో విమర్శలు కూడా వినవస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల ప్రారంభంలో అక్కినానేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతో హైడ్రా పై నమ్మకం పెరిగింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నాలాలను, చెరువులను ఆక్రమించుకునిచేసిన నిర్మాణాలను కూల్చివేయాలని అందరూ కోరుకున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు యధేచ్ఛగా జరుగుతున్నాఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తర్వాత విభజిత రాష్ట్రంరలోనూ ఆక్రమణలు ఆగలేదు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు ఆక్రమిస్తుండటంతో హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి.
కొందరి వైపే చూపు...
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాధ్ ను నియమించారు. హైడ్రా ప్రారంభించిన తొలి నాళ్లలో మేధావులతో పాటు రాజకీయ నేతలు కూడా ప్రశంసించారు. ఆక్రమణలు తొలగించాలనే నినాదం నగరమంతా వినిపించింది. అనేకచోట్ల ఆక్రమణలను తొలగించారు.అయితే రాజకీయనేతల ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం పై క్రమంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలను కూల్చివేయాలని, అవి చెరువులను ఆక్రమించి నిర్మాణాలుచేపట్టాయని బీజేపీ వంటి నేతలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. కానీ అక్కడ పేద విద్యార్థినులు చదువుకుంటున్నారని, సామాజిక, సేవా కోణంలో ఆలోచించి కూల్చివేయడం లేదని రంగనాధ్ తెలిపారు.
బెంగళూరుకు మించిపోయి...
కాని హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. హైడ్రా కేవలం సామాన్యుల ఆక్రమణలను తొలగించడానికే పనికివస్తుందని, సంపన్నులు, పొలిటికల్ లీడర్స్ జోలికి పోవడం లేదన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని కాలనీలు నీట మునిగాయి. బోట్లలో ప్రజలను హైడ్రా అధికారులే తొలగించాల్సి వచ్చింది. నాలాలు, చెరువులను ఆక్రమించుకున్నవారు ఎవరైనానిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారని హైడ్రా పై పెట్టుకున్న అంచనాలు మాత్రం ఆచరణలో కనిపించడం లేదు. మొన్న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం కూడా బెంగళూరును మించిపోయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఇప్పటికైనా హైడ్రా అధికారులు తరతమ బేధం లేకుండా ఆక్రమణలను, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చివేయాలని హైదరాబాద్ నగర వాసులు కోరుకుంటున్నారు.
Next Story