Wed May 07 2025 00:38:35 GMT+0530 (India Standard Time)
సీబీఐ సంచలన తీర్పు.. గాలి సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష.. సబితమ్మ నిర్దోషి
ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పుఇచ్చింది

ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పుఇచ్చింది. ప్రధాన నిందితులుగా ఉన్నశ్రీనివాస్ రడ్డి, గాలిజనార్ధన్ రెడ్డికినాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. మరో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డినిఈ కేసులో నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. సబిత ఇంద్రారెడ్డితో పాటుకృపానందాన్ని కూడా నిర్దోషిగా ప్రకటించింది. గాలిల జనార్ధన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. గాలి సోదరులిద్దరికి అంటే శ్రీనివాసరెడ్డికి, గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది.
పథ్నాలుగేళ్లు విచారించి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు ఈ కేసు సంచలనం సృష్టించింది. పథ్నాలుగేళ్ల పాటు ఈ కేసును సీబీఐ కోర్టు విచారించింది. ఈకేసులో అనేక మంది సాక్షులను విచారించిన తర్వాత వారు ఇచ్చిన స్టేట్ మెంట్లను ఆధారంగా చేసుకుని సీబీఐ విచారణ జరిపిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు చెప్పింది. సబితాఇంద్రారెడ్డికి మాత్రం ఊరట దక్కింది. 2009 డిసెంబరు 7న కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు తర్వాత 2011 లో ఛార్జిషీటు దాఖలు చేశారు. అక్రమమైనింగ్ జరిపి ఎగుమతి చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి 844 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని పేర్కొన్నారు.
Next Story