Tue May 06 2025 07:47:51 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. ఇబ్బంది పడుతున్న జనం
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది.అనేక ప్రాంతాల్లో ఉన్నట్లుండి వర్షం కురుస్తుంది.

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది.అనేక ప్రాంతాల్లో ఉన్నట్లుండి వర్షం కురుస్తుంది. దీంతో కార్యాలయాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ముందుగానే సూచించనట్లుగా హైదరాబాద్ లో సాయంత్రం వర్షం పడే అవకాశముందని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపినట్లుగానే వర్షం కురిసింది. అయితే ఒక్కసారిగా అకస్మాత్తుగా వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాఫిక్ సమస్యలను...
కొన్నిచోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.రోడ్ల మీదకు నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా సాగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. అనేక వాహనాలు రోడ్ల మీదనే నిలచిపోయాయి. కానీ ఉక్కపోతతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర వాసులకు వర్షం పడటంతో చల్లటి గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణం లభించినట్లయింది.
Next Story