హైదరాబాద్ ఐఐటీ యువకుడి ‘పంచాయత్ కిచెన్’ ;ఇంటి రుచిని నగరానికి పరిచయం చేసిన సాయి తేజా
భారతీయ వంటకాలు, సందర్భానుసారంగా కస్టమ్ మెనూలు

వ్యవసాయం నుంచి వంటశాల వరకు....
సాయి తేజా, ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి పూర్వ విద్యార్థి ,హైదరాబాద్ నగరంలో కొత్త రుచుల విప్లవాన్ని తెచ్చిన వ్యక్తి . రైతులను శక్తివంతం చేసే FarmOR అనే అగ్రిటెక్ స్టార్టప్‌తో తన వ్యాపార ప్రయాణాన్ని మొదలుపెట్టి. ఆ సంస్థ ద్వారా లక్ష మందికి పైగా రైతులను సరసమైన ఇన్‌పుట్‌లతో, నిపుణుల సలహాలతో అనుసంధానం చేశారు. కానీ ఎక్కడో మనుసులో చిన్న ఆశ ఇంటి రుచి గుర్తు చేసే భోజనం అందరికి అందించాలని, వ్యవసాయ రంగంలో బలమైన పునాదులు వేసుకున్నప్పటికీ; మన ఇంటి రుచిని , స్నేహితులను, కుటుంబాన్ని గుర్తు చేసే వాతావరణాన్నిఅందరికి అందుబాటులో ఉండాలని మొదలు పెట్టిందే పంచాయత్ కిచెన్.
పంచాయత్ కిచెన్ ఇంటి రుచిని, ఆత్మయితను పంచుకునే వంటలు
సాయి తేజ అభిరుచి పంచాయత్ కిచెన్ రూపంలో నిజమైంది. నగర మధ్యలోని ఈ హోటల్లో అడుగు పెట్టగానే ఇంట్లో లాగా ఆత్మీయతో కూడిన స్నేహపూర్వక వాతావరణం, వంటింటి సువాసన అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ భోజనం వడ్డించబడదు,ఆత్మీయతతో, మనసుతో, కుటుంబ బంధం తో పంచుకుంటారు.
ఇక్కడి విశేషాలు
తరతరాలుగా వస్తున్న నిజమైన భారతీయ వంటకాలు
గ్రామీణ ఆవరణను గుర్తు చేసే రస్టిక్ ఇంటీరియర్స్
సాదాసీదా అయినా రుచితో నిండిన మెనూ
ఉదయం టీ నుంచి సాయంత్రం భోజనం వరకు, ప్రతి భోజనాన్ని పంచాయత్ కిచెన్ ప్రత్యేక అనుభవంగా మార్చుతోంది.
ప్రతి వేడుకకు ‘పంచాయత్’ రుచులు
పెళ్లి , టీం లంచ్, పండుగల విందు ఏదైనా — సాయి తేజా బృందం 20 మంది నుంచి 1000 మందివరకు కేటరింగ్ సేవలు అందిస్తోంది. ప్రతి విందు భోజనం రుచి, శుభ్రత, ఆతిథ్యానికి సంకేతంగా నిలుస్తోంది.
సందర్భానుసారంగా కస్టమ్ మెనూలు
సమయానికి సరఫరా, ప్రొఫెషనల్ సర్వీస్
దక్షిణ, ఉత్తర భారత దేశ వంటలు, ఫ్యూజన్ వంటకాలతో వైవిధ్యం
కుటుంబ కల నుండి నగర రుచివైపు
సాయి తేజా,భార్య, సోదరుడు, వదిన కలిసి మొదలుపెట్టిన ఈ కుటుంబ కల ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రియమైన క్యూలినరీ అడ్రస్‌గా మారింది. పంచాయత్ కిచెన్ కేవలం రెస్టారెంట్ కాదు — ప్రేమతో తయారైన ఆహారం మనసును తృప్తిపరచగలదన్న సందేశం.
ఈ సారి ఇంటి రుచిని గుర్తుచేసే ఆహారం కావాలనిపిస్తే, పంచాయత్ కిచెన్‌కి వెళ్లండి.
పంచాయత్ కిచెన్, మన హృదయం నుంచి మీ ప్లేట్ వరకు. ఎప్పటికీ.మీరు కూడా పంచాయత్ కిచెన్ లోని వంటలు ఆస్వాదించాలనుకుంటారా?అడ్రస్-4th Floor, Amplio Business Center, opp. APARNA TOWERS, Hanuman Nagar, Kondapur, Hyderabad,
8977930773 for Orders/Reservations

