Tue May 06 2025 15:02:07 GMT+0530 (India Standard Time)
ఓబులా పురం మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు
నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు రానుంది

నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు రానుంది. 14 ఏళ్ల తర్వాత తుది తీర్పును సీబీఐ కోర్టు వెలువరించనుంది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణలు వచ్చాయి.
884 కోట్ల నష్టమంటూ...
ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి రోశయ్య ప్రభుత్వం జీవో. 71 విడుదల చేసింది .2011లో మొదటి చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని సీబీఐ అభియోగాలు నమోదయింది. 219 మంది సాక్షులను విచారించి, 3,400 డాక్యుమెంట్లలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంతో తుది తీర్పు ఏం రానుందన్న టెన్షన్ నెలకొంది.
Next Story