Wed Dec 10 2025 10:31:03 GMT+0530 (India Standard Time)
Earth Quake : అమెరికాలో భూకంపం
అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతగా నమోదయింది

అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతగా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉదయం 8.11 గంటల సమయంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అలాస్కాలోని సిసిట్నాకు వాయువ్యంగా ఏడు మైళ్ల దూరంలోనూ, అంకరేజ్ కు వాయువ్యంా 35 మైళ్ల దూరంలో ఉందని చెప్పింది.
రిక్టర్ స్కేల్ పై...
అయితే భూకంప తీవ్రత కు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. భూకంపాలు తరచూ వస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం వచ్చిన భూకంప తీవ్రత 2018 వచ్చిన భూకంపం తరహాలో ఉందని ప్రజలు చెబుతున్నారు.
Next Story

