Tue Jul 22 2025 03:04:30 GMT+0530 (India Standard Time)
మనకూ టెస్లా కారు ధర ఎంతంటే?
ఎలాన్ మస్క్‌కు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించింది.

ఎలాన్ మస్క్‌కు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కంపెనీ ఏర్పాటు చేసిన తొలి షోరూమ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు.
‘మోడల్ వై’తో
‘మోడల్ వై’తో టెస్లా భారత మార్కెట్ విక్రయాలను ప్రారంభించింది. ఈ కారు రెండు వేరియంట్లలో లభించనుంది. రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 59.89 లక్షలు కాగా. లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ రేటును 67.89 లక్షలుగా నిర్ణయించారు. కారు రిజిస్ట్రేషన్, డెలివరీ సేవలు తొలుత ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్‌లో అందుబాటులో ఉంటాయి. రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ పూర్తి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్లో 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
Next Story