Tue Jul 22 2025 02:51:34 GMT+0530 (India Standard Time)
సేఫ్ గా ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతరిక్షం నుంచి భూమి మీదకు సేఫ్ గా ల్యాండ్ అయింది

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతరిక్షం నుంచి భూమి మీదకు సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో యాక్సియం -4 మిషన్ ప్రయోగం విజయవంతమయినట్లయింది. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండైన క్యాప్సూల్ నుంచి శుభాంశు క్షేమంగా బయటికొచ్చారు. నవ్వుతూ అభివాదం చేశారు. మొత్తం నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను క్వారంటైన్ కు తరలించార. అంతరిక్షంలో పద్దెనిమిది రోజులు గడిపిన శుభాంశు శుక్లా బృందం అనేక ప్రయోగాలు జరిపి క్షేమంగా భూమి మీదకు వచ్చింది.
భూమి మీదకు చేరిన వెంటనే...
అంతరక్షం నుంచి భూమి మీదకు చేరిన వెంటనే శుభాంశు శుక్లా కు ప్రధాని మోదీ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. బిలియన్ డ్రీమ్స్ ను ఇన్ స్పెయిర్ చేశారని కొనియాడారు. గగన్ యాన్ మిషన్ కు ఇది కీలక ముందడుగని వ్యాఖ్యా నించారు. ఇది భారత్ గర్వించదగ్గ క్షణమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. మధ్యాహ్నం 3.01 గంటలకు కాలిఫోర్నియా సముద్ర తీరంలోకి దిగిన శుభాంశుక్లా బృందానికి ఘన స్వాగతం లభించింది.
Next Story