Tue Jul 22 2025 03:32:28 GMT+0530 (India Standard Time)
బంగ్లాదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. 19 మంది మృతి చెందారు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాలపై శిక్షణ యుద్ధవిమానం కూలిపోవడంతో పదహారు మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. పైలట్ కూడా మరణించార. ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ శిక్షణ విమానం ఒక్కసారిగా మైల్ స్టోన్ పాఠశాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో యాభై మంది తీవ్రగాయాల పాలయ్యారు. వీరిందరినీ ఆసుపత్రిలోచకిత్స నిమిత్తం చేర్చారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే...
పాఠశాల జరిగే సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది విద్యార్థులు దుర్మరణం పాలయినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. విమానం కూలినవెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పైలెట్ శిక్షణ విమానం కూలిపోవడంతో భవనంలో కొంత భాగం కూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు
Next Story