Israel - Iran War : మధ్యప్రాచ్య యుద్ధం ఆగేట్లు లేదు.. ఎన్నిరోజులు సాగుతుందో?
మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసే లక్షణాలు శుక్రవారం కనిపించలేదు

మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసే లక్షణాలు శుక్రవారం కనిపించలేదు. ఇరాన్ నుంచి కాల్పులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. కువైట్, బహ్రెయిన్పై దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. పర్షియన్ నూతన సంవత్సర వేడుకల ముగింపు సందర్భంగా వంతెన సమీపంలో సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ఇరాన్ తెలిపింది. ఆ వంతెనపై అమెరికా దాడి చేసినట్లు సమాచారం. పొరుగుదేశాలపై దాడి చేసే సామర్థ్యం తనకు ఉందని ఇరాన్ మళ్లీ చూపించింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం నుంచి ముప్పు దాదాపు తీరిపోయిందని వ్యాఖ్యానించారు. గురువారం వంతెన కూలిన దృశ్యాలను ఆయన ప్రశంసించారు. అది మధ్యప్రాచ్యంలోనే ఎత్తైన వంతెనగా చెబుతున్నారు. ఆ వంతెనపై దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. నౌరూజ్ పండుగ చివరి రోజు ప్రకృతి దినోత్సవంగా జరుపుకునే వేడుకల్లో పాల్గొన్న 95 మంది గాయపడినట్లు తెలిపింది.

