Tue May 06 2025 07:16:59 GMT+0530 (India Standard Time)
కాళ్ల కింద బంగారు నిధి.. చూసిన వారు ఆశ్చర్యపోయి?
చెక్ రిపబ్లిక్ లోని ఈశాన్య పర్వతాల్లో హైకింగ్ కు వెళ్లి ఇద్దరు పర్యాటకులు నడుస్తుండగా అక్కడ బంగారు నాణేలు, ఆభరణాలు కనిపించాయి.

అదృష్టం ఎప్పుడైనా తలుపుతట్టొచ్చు. అదే సమయంలో ఎక్కడకు వెళ్లినా లక్ మన వెంటే ఉండచ్చు. కానీ దరిద్రం వెంట పడితే మాత్రం అస్సలు తట్టుకోలేం. అదే లక్కు మన వైపు చూస్తే చాలు సంబరపడిపోతాం. కోటీశ్వరులుగా రాత్రికి రాత్రికి రాత్రి మారిపోతాం. చెక్ రిపబ్లిక్ ప్రాంతంలో ఇద్దరు పర్యాటకులకు లక్ మామూలుగా తగలలేదు. బంగారు నిధి కాళ్లకు తగలడంతో రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు. చెక్ రిపబ్లిక్ లోని ఈశాన్య పర్వతాల్లో హైకింగ్ కు వెళ్లి ఇద్దరు పర్యాటకులు నడుస్తుండగా అక్కడ బంగారు నాణేలు, ఆభరణాలు కనిపించాయి.
హైకింగ్ కు వెళ్లిన సమయంలో...
అందులో చూడగా 598 బంగారు ఆభరణాలున్నాయి. అయితే ఈ సంపదను వారు తమ వద్ద ఉంచుకోకుండా ప్రభుత్వానికి అప్పగించారు. వాటిని ప్రభుత్వం మ్యూజియంలో ఉంచింది. బంగారు నాణేలన్నీ 1808 నాటివిగా గుర్తించారు. ఎవరైనా అక్కడ దాచి పెట్టి ఉంటే అవి ఇప్పుడు హైకింగ్ వెళ్లినప్పుడు బయటపడింది. గత ఫిబ్రవరి నెలలో ఈ ఘటన జరిగినా మ్యూజియం అధికారులు తాజాగా ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. వీటి విలువ 2.87 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు ఈ సంపదను దాచి ఉండవచ్చని భావిస్తున్నారు.
Next Story