Iran - Israel War : మధ్యప్రాచ్యానికి అమెరికా క్షిపణుల మళ్లింపు...నాటో భద్రతపై ఆందోళన
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది. ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా తన రక్షణ వనరులను మధ్యప్రాచ్యానికి మళ్లిస్తోంది. ఈ నేపథ్యంలో యూరప్‌లో రక్షణ వ్యవస్థల్లో లోటు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం నాల్గో వారంలోకి అడుగుపెట్టగా, అమెరికా వేలాది సైనికులను ఆ ప్రాంతానికి పంపింది. అదనంగా 200 బిలియన్ డాలర్ల నిధులు కోరింది. ఇదే సమయంలో ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోంది. అమెరికా స్థావరాలు, పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లపై కూడా దాడులు జరిగాయి. యుద్ధం ప్రారంభం తర్వాత ఇరాన్ నుంచి టర్కీ వైపు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో, జర్మనీ నుంచి రెండు పేట్రియట్ క్షిపణి వ్యవస్థలను టర్కీకి పంపారు. యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి కూడా పేట్రియట్ క్షిపణులను మధ్యప్రాచ్యానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

