Tue Jul 22 2025 02:54:41 GMT+0530 (India Standard Time)
ఖండాంతర క్షిపణి కే-6 ని తీసుకొస్తున్న భారత్
దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణి కే-6 ని భారత్ అభివృద్ధి చేస్తోంది. 8 నుండి 12 వేల కిలోమీటర్ల రేంజి ఉంటుందని సమాచారం.

దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణి కే-6 ని భారత్ అభివృద్ధి చేస్తోంది. 8 నుండి 12 వేల కిలోమీటర్ల రేంజి ఉంటుందని సమాచారం. ఇది సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ మిస్సైల్. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల ఖండాంతర క్షిపణి. డీఆర్డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లోని ‘అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ లేబొరేటరీ’లో అభివృద్ధి చేస్తున్నారు. ‘కె’ శ్రేణి క్షిపణుల్లో ఈ కే-6 అత్యంత అధునాతనమైనది. ఇది ఘన ఇంధనంతో పనిచేసే మూడంచెల క్షిపణి. దాదాపు 39 అడుగుల పొడుగు, ఆరున్నర అడుగుల వెడల్పుతో ఉండే ఈ క్షిపణులు 2 నుంచి 3 టన్నుల దాకా పేలోడ్‌ను మోసుకెళ్లగలవు. శబ్దం కన్నా 7.5 రెట్ల వేగాన్ని అందుకోగల హైపర్ సానిక్ క్షిపణులు. గంటకు దాదాపు 9,200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ క్షిపణులను గుర్తించి, అడ్డుకోవడం శత్రు దేశ రక్షణ వ్యవస్థలకు చాలా కష్టం.
Next Story