Tue Jul 22 2025 02:59:53 GMT+0530 (India Standard Time)
సాయం చేసిన బాలుడిని చదివించనున్న భారత ఆర్మీ
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఆ సమయంలో ఓ పదేళ్ల బాలుడు భారత సైనికులకు అండగా నిలిచారు. ఓ వైపు బాంబులు పడుతున్నా, భారీగా శబ్దాలు వస్తున్నా భారత సైన్యానికి మంచినీరు, పాలు, టీ, లస్సీ వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు శ్వాన్ సింగ్. ఆ బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు అతడి చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లాలో తారావాలీ అనే గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 2 కిలో మీటర్ల దూరంలో ఉంది. పాకిస్థాన్ తో భారత సైన్యం తలపడుతున్న వేళ శ్వాన్ సింగ్ సైనికులకు తోడుగా నిలిచాడు. అతడి ధైర్యాన్ని దేశం మొత్తం మెచ్చుకుంది.
Next Story