Fri Mar 20 2026 05:12:48 GMT+0530 (India Standard Time)
'పినాక' ప్రయోగం విజయవంతం
భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అవ్వనుంది.

భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అవ్వనుంది. దేశీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశలో భాగంగా చేసిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక - ఎల్ఆర్జీఆర్ 120 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ప్రయోగాన్ని డీఆర్డీవో ఒడిశాలోని చండీపూర్ నుంచి చేపట్టింది. ఈ రాకెట్ గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.
Next Story

