Sat Mar 21 2026 16:15:26 GMT+0530 (India Standard Time)
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. పది రోజుల పాటు పెంచిన టిక్కెట్ల ధరలు అమలయ్యేలా ఉంటాయని చెప్పింది. బెన్ ఫిట్ షో ధరకు ఐదు వందల రూపాయలు, సింగిల్ స్క్రీన్ పై ధర వంద రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
టిక్కెట్ ధరలను పెంచుతూ...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. 19వ తేదీన బెనిఫిట్ షో ధరలపై ఐదు వందల రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రతి రోజూ బెనిఫిట్ షోతో పాటు అదనంగా ఐదు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

