4000 కోట్లు రామాయణకు చేస్తున్న ఖర్చు
నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామాయణ’ సినిమా బడ్జెట్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందించారు.

నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామాయణ’ సినిమా బడ్జెట్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందించారు. అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా 4వేల కోట్లతో ఈ సినిమా రూపొందుతోందని అన్నారు. తాము ఎవరి నుంచి డబ్బు తీసుకోవాలనుకోవడం లేదని, ఏడు సంవత్సరాల క్రితమే సినిమా నిర్మాణం కోసం పనులు ప్రారంభించామన్నారు. ఈ సినిమా సుమారు 4వేల కోట్ల రూపాయలతో తెరకెక్కుతోందన్నారు. ఈ ఇతిహాసాన్ని ప్రపంచమంతా చూడాలని, ఆ లక్ష్యంతోనే దీన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నామన్నారు. మన సంస్కృతికి పునాదిగా నిలిచిన ఇతిహాసాన్ని, సాధ్యమైనంత గొప్పగా తెరకెక్కించనున్నామని నమిత్ మల్హోత్రా తెలిపారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది. ఈ సినిమాలో రాముడిపాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీడియోల్ నటిస్తున్నారు.