Tue May 06 2025 07:44:22 GMT+0530 (India Standard Time)
Samantha : సమంత ఓపెన్ అయిపోయారుగా.. నావెంటే తను ఉన్నాడంటూ?
గోల్డెన్ క్వీన్ అవార్డును అందుకున్న సినీనటి సమంత తన మనసులో మాటను బయటకు చెప్పేశారు.

హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత ఫ్రీ బర్డ్ అయపోయారు. అనేక మూవీలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నారు. అయితే సమంత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆమె తన భవిష్యత్ కు దారి చూపుతున్నట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. గోల్డెన్ క్వీన్ పురస్కార ప్రదానాలు కోలివుడ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై గోల్డెన్ క్వీన్ అవార్డును అందుకున్న సమంత తన మనసులో మాటను బయటకు చెప్పేశారు. కేవలం ఒకే అంశం ఆధారంగా కెరీర్ ను నిర్ణయించలేమని తెలిపారు.
అనారోగ్యానికి గురయిన సమయంలో...
దీంతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె పంచుకున్నారు. తొలిసారి బహిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు రాహుల్ తన వెంటే ఉన్నాడని, ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనతోనే ఉంటూ తనను జాగ్రత్తగా చూసుకున్నాడని అన్నారు. తమ అనుబంధానికి పేరు ప్రత్యేకంగా పెట్టలేమని, తన స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడన్నది తాను చెప్పలేనని సమంత అన్నారు.
కెరీర్ పరంగా...
సమంత ఇటీవల అనారోగ్యానికి గురయినప్పుడు రాహుల్ రవీంద్రన్ తానే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడని మాత్రం చెప్పిన సమంత వారి అనుబంధానికి మాత్రం కరెక్ట్ నిర్వచనం మాత్రం చెప్పలేదు. అయినా తాను రాహుల్ రవీంద్రన్ వల్లనే బతికి బయటపడ్డానంటూ చెప్పుకొచ్చారు. తనకు లక్ తో పాటు అభిమానులు ఉండటం ఒక రకంగా అదృష్టమేనని, దీనిని తాను దేవుడిచ్చిన వరంగానే భావిస్తానని సమంత అన్నారు. కెరీర్ పరంగా ఎవరైనా ముందుగా ఊహించుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదని సమంత అన్నారు. తెలిసి, తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు కెరీర్ పై కూడా ప్రభావం చూపుతాయని తెలిపారు.
Next Story