Wed Jul 23 2025 06:01:10 GMT+0530 (India Standard Time)
చిరంజీవి-అనిల్ రావి పూడి సినిమాకు లీకుల బెడద
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కేరళ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కేరళ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ సన్నివేశం షూటింగ్కు సంబంధించిన చిత్రాలను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నిర్మాణసంస్థ స్పందించింది. అనధికారికంగా షూటింగ్ రికార్డు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ అనుమతి లేకుండా సెట్స్ నుంచి కంటెంట్ రికార్డు చేయొద్దని కోరుతున్నామని, ఇలాంటి పనుల వల్ల షూటింగ్కు అంతరాయం కలగడమే కాకుండా దీనికోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న టీమ్ అందరినీ బాధ పెట్టినట్లే అవుతుందని విజ్ఞప్తి చేసింది చిత్రయూనిట్. అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని అభిమానులను నిర్మాణ సంస్థ కోరింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story