Wed Jul 23 2025 09:38:35 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ సెలబ్రిటీలు నలుగురికి ఈడీ నోటీసులు
టాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

టాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సినీ పరిశ్రమకు చెందిన నలుగురు సెలబ్రిటీలకు నోటీసుల జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కారణంతో వారిని విచారించేందుకు వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్స్ చేస్తున్న పలువురు సినీ సెలబ్రిటీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు ఇప్పటికే కేసు ననమోదు చేశారు. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసింది. వీరిని విచారించేందుకు సిద్ధమవుతుంది.
విచారణకు హాజరు కావాలని...
సినీనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచులక్ష్మి, ప్రకాశ్ రాజా, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితర నటులపై సైబరాబాద్ పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. సిని సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ ఫ్యూయెర్స్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ఈడీ అధికారులువారిని విచారించాలని నిర్ణయించారు. ఇక యాంకర్ శ్యామల, శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయనిపావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బంగారు సుప్రిత పేర్లు కూడా ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ముందుగా దగ్గుబాటి రానాను ఈ నెల 23, ప్రకాశ్ రాజ్ ను ఈ నెల 30, విజయ్ దేవరకొండను ఆగస్టు 6, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
Next Story