Sat Mar 21 2026 16:08:18 GMT+0530 (India Standard Time)
విజయ్ దేవరకొండ ఇంటికి రేవంత్
సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు

సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. హైదరాబాద్ లో జరిగిన విజయ్ దేవర కొండ, రష్మికల వివాహ రిసెప్షన్ కు రేవంత్ రెడ్డి హాజరు కాలేకపోయారు. ఆయన ఢిల్లీ పర్యటనతో పాటు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉండటంతో ఆ ఫంక్షన్ కు వెళ్లలేకపోయారు.
వివాహ రిసెప్షన్ కు...
దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి జంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మిక లకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన రేవంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు.
Next Story

