Tue May 06 2025 08:29:20 GMT+0530 (India Standard Time)
అక్కినేని ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది
అక్కినేని వారబ్బాయి నాగచైతన్య కొత్త మూవీపై ఫ్యాన్స్ కు మంచి కబురు అందింది

అక్కినేని వారబ్బాయి నాగచైతన్య కొత్త మూవీపై ఫ్యాన్స్ కు మంచి కబురు అందింది. ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య నటించిన చిత్రం తండేల్ ఇటీవల విడుదలయి సూపర్ హిట్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కు మంచి ఊపునిచ్చింది. అయితే నాగచైతన్య ఎంచుకునే మూవీలు ఇకపై వెరైటీ ఉంటాయని మరో చిత్రం రెడీ అవ్వబోతుంది. విరూపాక్ష మూవీ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇది మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే షూటింగ్...
నాగచైతన్య, కార్తీక్ దండుతో కలసి వచ్చే మూవీ కోసం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ పరిరసర ప్రాంతాల్లో భారీ సెట్లు వేసినట్లు మూవీ టీం రివీల్ చేసింది. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోవడంపై కూడా అనేక వార్తలు వచ్చాయి. ఎందుకు ఆలస్యమయిందో వివరిస్తూ మూవీ టీం ఒక వీడియోను కూడా తాజాగా విడుదల చేసింది. మైథికల్ థ్రిల్లర్ కావడంతో గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి వాటిపై టీం రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు.
చిత్రం పేరు ప్రకటించకపోయినప్పటికీ...
గుహల్లాంటి ప్రాంతంలోనే ఈ మూవీ తీయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీలో నాగచైతన్య పెద్ద మిస్టరీని ఛేదించే వ్యక్తిగా నాగచైతన్య కనిపించబోతున్నట్లు వీడియో ద్వారా వెల్లడయింది. మిస్టరీతో కూడిన కథను ఎండింగ్ కూడా ఆకట్టుకునేలా అందరినీ మెప్పించేలా ఈ మూవీ రూపుదిద్దుకుంటుందని మూవీ టీం చెప్పింది. దీనిపై నాగ చైతన్య కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో నటించిన సినిమాలకు భిన్నమైన మూవీని చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎన్.సి 24 గా చెప్పిన ఈ చిత్రం పేరు మాత్రం వృషకర్మ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Next Story