Tue May 06 2025 07:15:28 GMT+0530 (India Standard Time)
Raja Sab : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊరించే న్యూస్... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారుగా?
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీపై ఎప్పటికప్పుడు సినీ నిర్మాతలు, దర్శకుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తున్నారు

పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీపై ఎప్పటికప్పుడు సినీ నిర్మాతలు, దర్శకుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ ను ఆ ట్రాన్స్ లో ఉంచేందుకు ఊరించేందుకు.. వారానికి ఒక అప్ డేట్ వైరల్ చేస్తూ రాజాసాబ్ మూవీకి మరింత హైప్ తెచ్చేస్తున్నారు. సాధారణంగా ప్రభాస్ మూవీ అంటేనే అదొక క్రేజ్. దానికి ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన పనిలేదు. ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు. థియేటర్లు ఫ్యాన్స్ తో నిండిపోయి నిర్మాతలకు కాసులు తెచ్చిపెడతాయి. అలాంటి ప్రభాస్ మూవీపై ఫ్యాన్స్ తో పాటు డార్లింగ్ ను అభిమానించే వారంతా ఏదో ఒక న్యూస్ వినాలని కోరుకుంటారు. అందుకోసమే వారంలో కనీసం రెండు కీలకమైన అప్ డేట్ లతోనైనా సోషల్ మీడియాలో తెస్తుంటారు.
భారీ అంచనాల మధ్య...
మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. మారుతి డైరెక్షన్ అంటేనే ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతామన్న అభిప్రాయం ఫ్యాన్స్ లో కనపడుతుంది. రాజాసాబ్ మూవీని ఈ నెల పదో తేదీ విడుదల చేయాలని మొదట అనుకున్నప్పటికీ అనేక కారణాలతో పోస్ట్ పోన్డ్ చేశారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రాజాసాబ్ ను విడుదల చేయాలన్న ఆలోచనలో డైరెక్టర్, నిర్మాతలు ఉన్నారు. అందుకు అనుగుణంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయిందని, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో పాటు వీఎఫ్ఎక్స్ పనులు కూడా చేయాల్సి రావడంతోనే వాయిదా పడింది.
కీలక అప్ డేట్ ఇదే...
కానీ రాజాసాబ్ గురించి మరో ముఖ్యమైన అప్ డేట్ వచ్చేసింది. అదీ ఏంటంటే.. రాజాసాబ్ టీజర్ ను త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రెండు వారాల్లో రాజాసాబ్ టీజర్ వచ్చేస్తుందని తాజాగా లీక్ ఇచ్చారు నిర్మాతలు. ప్రభాస్ డబ్బింగ్ పార్ట్ పూర్తయితే ఇక మూవీ విడుదలకు సిద్ధమవుతుందని చెబుతున్నారు. డబ్బింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే టీజర్ ను రిలీజ్ చేసే యోచనలో దర్శకుడు మారుతి ఉన్నారు. రెండు వారాల తర్వాత రాజాసాబ్ కు సంబంధించి వరస అప్ డేట్ లు కూడా ఉంటాయని అభిమానులను ఊరించే న్యూస్ చెప్పారు. థ్రిల్లింగ్ తో కూడిన హర్రర్ సినిమాగా దీనిని చిత్రీకరిస్తున్నారు. మొత్తం మీద రాజాసాబ్ టీజర్ కోసం మరో రెండు వారాలు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.
Next Story