Tue May 06 2025 08:45:49 GMT+0530 (India Standard Time)
Tolywood : బన్నీకి రౌడీ బాయ్ పంపిన గిఫ్ట్ చూసిన వారు షాకవ్వాల్సిందే
అల్లు అర్జున్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పంపిన గిఫ్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది

టాలీవుడ్ గతంలో మాదిరిగా లేవు. గతంలో హీరోల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల హయాంలో అభిమానుల మధ్య కూడా విపరీతమైన ఘర్షణలు ఉండేవి. నాటి రోజుల్లో పోస్టర్లపై పేడ చల్లడం, ఒకరిపై ఒకరు దూషించుకోవడం వంటివి చేసేవారు. కానీ నాడు కూడా సినీనటులందరూ ఐక్యంగానే ఉండేవారు. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఈ రకమైన కాంపిటేషన్ ఉండేది. అయితే నేటి యువతరం హీరోలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. పోటీతో సంబంధం లేకుండా, హిట్ అనే ప్రస్తావన లేకుండా స్నేహంగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ కూడా మంచి ఫ్రెండ్స్. అలాగే అల్లు అర్జున్ తో కూడా అనేక మంది హీరోలు ఫ్రెండిషిప్ తో ఉంటారు.
అసూయ లేకుండా...
వారి సినిమాలు వారివి. ఏసినిమా హిట్ అయినా అసూయ లేదు. వేరే ఆలోచన లేదు. యంగ్ హీరోలందరూ కలిసి మెలిసి ఉంటారు. ఇగోలకు వెళ్లరు. టాలీవుడ్ లో ఇలాంటి మంచి సంస్కృతి ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరినొకరు విష్ చేసుకోవడం, గిఫ్ట్ లు పంపుకోవడం వంటివి కూడా తరచూ చేస్తూ తమలో ఎలాంటి విభేదాలు లేవని తమ ఫ్యాన్స్ కు నేరుగానే సందేశాన్ని పంపుతుంటారు. తాజాగా అల్లు అర్జున్ కు విజయ్ దేవరకొండ గిఫ్ట్ పంపడం కూడా అందులో భాగంగానే చూడాలి. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. దీంతో ఇద్దరు అరమిరకలు లేకుండా ఒకరు నటించిన మూవీ హిట్ కావాలని మరొకరు కోరుకుంటారు.
గిఫ్ట్ పంపడంతో...
తాజాగా అల్లు అర్జున్ కు విజయ్ దేవరకొండ గిఫ్ట్ పంపారు. తన రౌడీ బ్రాండ్ స్టోర్ నుంచి బన్నీకి డ్రెస్ లతో పాటు బన్నీ పిల్లలకు బర్గర్ లను విజయ్ దేవరకొండ పంపారు. ఇటీవల విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో రౌడీ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించిన నేపథ్యంలోనే ఈ గిఫ్ట్ లను అల్లు అర్జున్ కు పంపినట్లు చెబుతున్నారు. దీనికి బన్నీ కూడా అంతే స్వీట్ గా బదులిచ్చాడు. "మై స్వీట్ బ్రదర్.. నువ్వు ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుంటావు. సో...స్వీట్" అంటూ పోస్టు చేశారు. నీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కు విజయ్ దేవరకొండ కూడా అదే రీతిలో బదులిచ్చారు. లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో వీరిద్దరి స్నేహం ఇప్పుడు మరోసారి గిఫ్ట్ ల ద్వారా వెలుగులోకి వచ్చినట్లయింది.
Next Story