Tue May 06 2025 08:56:29 GMT+0530 (India Standard Time)
Prabhas : డార్లింగ్ ఫ్యాస్స్ కు గుడ్ న్యూస్..కల్కి సీక్వెల్ పై సూపర్ న్యూస్
డార్లింగ్ ఫ్యాస్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన కల్కి సీక్కెల్ పై బిగ్ అప్ డేట్ వచ్చింది

డార్లింగ్ ఫ్యాస్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన కల్కి సీక్కెల్ పై బిగ్ అప్ డేట్ వచ్చింది. కల్కి గత ఏడది విడదలయిన బాక్సాఫీసు వద్ద బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతకు కలెక్షన్లు తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ విడుదలయిన రోజునే కల్కి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. సీక్వెల్ ఎప్పుడు వస్తుందా? అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ పై తాజా అప్ డేట్ ఇచ్చేశారు.
ఈ ఏడాది చివరి నాటికి...
కల్కి 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ అనేక మంది నాగ్ అశ్విన్ ను ప్రశ్నించారు. దీనికి నాగ్ అశ్విన్ తనదైన స్టయిల్ లో సమాధానమిచ్చారు. కల్కి ని మూడు, నాలుగు గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశానని, అయితే దాని సీక్వెల్ ను 7, 8 గ్రహాలు ఒకే వరసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తానని కామెంట్స్ చెప్పారు. అయితే దీనిపై ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందన్న నాగ్ అశ్విన్ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలపడంతో కల్కి సీక్వెల్ పై వాస్తవాన్ని రివీల్ చేశారు.
స్క్రీన్ స్పేస్ ...
అయితే సీక్వెల్ లో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని నాగ్ అశ్విన్ తెలిపారు. కర్ణ, భైరవ యాంగిల్ లోనే కథ నడుస్తుందని కూడా నాగ్ అశ్విన్ తెలిపారు. వైజయంతి మూవీస్ పతాకంపైనే ఈ సీక్వెల్ కూడా రూపుదిద్దుకుంటుందని నాగ్ అశ్విన్ తెలిపారు. కల్కి విడుదల బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను సంపాదించింది. ఈ సీక్వెల్ కూడా అదే రేంజ్ లో వీక్షకులను అలరిస్తుందని, ఆ మేరకు స్క్రిప్ట్ తయారీ అవుతుందని ఆయన చెప్పడం నిజంగా ప్రభాస్ ఫ్యాస్స్ కు వీనుల విందయిన వార్తగానే చెప్పాలి.
Next Story