Mon Feb 02 2026 10:58:33 GMT+0530 (India Standard Time)
చిరంజీవి సినిమాకు ఏపీ సర్కార్ భారీ గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పది రోజులు టికెట్ ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభతు్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా చిరంజీవి నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలవుతున్న మన శంకర్ వరప్రసాద్ సినిమాకు మంచి హైప్ లభించింది.
రేపు రాత్రి నుంచి...
జనవరి 11వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య స్పెషల్ షోకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పెషల్ షో టికెట్ ధర రూ.500గా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరొకవైపు సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.125 పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల పాటు ఈ టిక్కెట్ల ధరలు అమలులో ఉంటాయి.
Next Story

