Wed Jul 23 2025 06:17:30 GMT+0530 (India Standard Time)
సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గించిన ప్రభుత్వం
సినిమా టికెట్ల ధరల పెంపు థియేటర్లకు వచ్చే జనంపై ప్రభావం చూపుతోందనే చర్చ జరుగుతూ ఉంది.

సినిమా టికెట్ల ధరల పెంపు థియేటర్లకు వచ్చే జనంపై ప్రభావం చూపుతోందనే చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చినట్లుగా ప్రాంతీయ చిత్రాలకు టికెట్ ధరలపై 200 రూపాయల పరిమితిని విధిస్తున్నట్లు తెలిపారు. వినోదపు పన్ను సహా రేట్లు 200 రూపాయలు మించకుండా ఉండేందుకు సినిమా టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని భాషల చిత్రాలు, సింగిల్ స్క్రీన్స్తోపాటు మల్టీప్లెక్స్ల్లోనూ ఇదే వర్తించనుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని కోరింది. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
Next Story