Sun Jul 27 2025 00:21:32 GMT+0530 (India Standard Time)
Viswambhara : హమ్మయ్య విశ్వంభర పూర్తయింది.. ఇక స్క్రీన్ పైకి వచ్చేదెప్పుడని?
మెగా ఫ్యాన్స్ కు తీపి కబురు అందింది. త్వరలోనే విశ్వంభర మూవీ విడుదలయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి

మెగా ఫ్యాన్స్ కు తీపి కబురు అందింది. త్వరలోనే విశ్వంభర మూవీ విడుదలయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మేకర్స్ ఇంకా అధికారికంగా తేదీలు ప్రకటించకపోయినప్పటికీ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయని చిత్ర పరిశ్రమల వర్గాల ద్వారా అందుతున్నసమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తుంది.
చిత్రీకరణ పూర్తి కావడంతో...
అయితే తాజా అప్ డేట్ ప్రకారం విశ్వంభర చిత్రీకరణ పూర్తయిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లో రీమిక్స్ సాంగ్ పూర్తయిందని అంటున్నారు. బాలివుడ్ తార మౌనిరాయ్ పై చిరంజీవితో ఈ పాటను హైదరాబాద్ లో చిత్రీకరించారు. ఇది చివరి చిత్రీకరణ అని, ఈ పాట చిత్రీకరణతో సినిమా పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ఇక విశ్వంభర చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. వేగంగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్మాతలు భావిసత్ున్నారు.
త్వరలో రిలీజ్ తేదీని...
మెగాస్టార్ సరసన త్రిష ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా మరో నటి ఆషికా రంగనాధ్ కూడా నటించారు. విశ్వంభర చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ కోసం ఒకసారి వాయిదా వేశారు. వీఎఫ్ఎక్స్ పనులను మళ్లీ చేయాలని నిర్ణయించడంతో విడుదల వాయిదా పడిందని అంటున్నారు. యు.వి. క్రియేషన్స్ పై నిర్మిస్తున్న విశ్వంభర చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించేందుక సిద్ధమవుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కు దసరాకు ముందే పండగ వచ్చినట్లేనని అనుకోవాల్సిందే.
Next Story