Tue May 06 2025 08:22:56 GMT+0530 (India Standard Time)
Ramcharan : "పెద్ది" షూటింగ్ కు విరామం.. మళ్లీ మొదలయ్యేది అప్పుడేనట
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తర్వాత రామ్ చరణ్ బ్రేక్ తీసుకోనున్నారు

మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తర్వాత రామ్ చరణ్ బ్రేక్ తీసుకోనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మూవీ మేకర్స్ పెద్ది మూవీకి సంబంధించి అనేక అప్ డేట్స్ ఇచ్చారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రానికి కూడా సినీదర్శకుడు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఏఆర్ రహమాన్ నుంచి వచ్చిన ఈ మూవీ సాంగ్ మామూలుగా లేదు. చెర్రీ అభిమానులు ఊగిపోయేలా ఉంది.
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో...
అయితే పెద్ది మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ఇక మే రెండో వారంలోనే రెండో షెడ్యూల్ ను ప్రారంభించాలని దర్శకుడు నిర్ణయించారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించారు. హీరోయిన్ గా జాన్వీకపూర్ కూడా ఉండటంతో విడుదలకు ముందే మంచి హైప్ ఈ మూవీకి క్రియేట్ అయిందని చెప్పాలి. ఇందులో ప్రధాన పాత్రల్లో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. దివ్యేందు శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పెద్ది ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో రెండో షెడ్యూల్ కు మాత్రం ఒకింత సమయం తీసుకుంటున్నారు. ఇందుకు రామ్ చరణ్ విదేశీపర్యటనలే కారణమని చెబుతున్నారు.
లండన్ వెళుతున్నందున...
పెద్ది మూవీలో నటిస్తున్న రామ్ చరణ్ వచ్చే నెల 9వ తేదీన లండన్ వెళుతున్నారు. అక్కడ టూస్సాడ్స్ లో జరిగే రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. రామచరణ్, ఉపాసనలు కలసి లండన్ బయలుదేరివెళుతును్నారు. అలాగే మే 11వ తేదీన రాయల్ అల్బర్ట్ హాల్ లో జరగనున్న RRR రాయల్ ఫిల్హార్మోనిక్ లైవ్ కన్సర్ట్ లో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కూడా పాల్గొంటున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే పెద్ది రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అంటే మే రెండో వారంలోకాని మళ్లీ పెద్ది మొదలు కాదన్నది టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story