Tue May 06 2025 08:28:09 GMT+0530 (India Standard Time)
Chiranjeevi : శివశంకర ప్రసాదూ.. నీకు జోడీ కుదిరిందటగా
మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకంటే ఎక్కువగా ఎనర్జీతో నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకంటే ఎక్కువగా ఎనర్జీతో నటిస్తున్నారు. పాటలు, ఫైటింగ్స్ లో చిరంజీవిది ఇప్పటికీ ప్రత్యేక స్టయిల్ ఉంటుంది. పాటల్లోనైనా, ఫైట్ లలోనైనా చిరంజీవి విషయంలో స్పెషల్ అటెన్షన్ తో డ్యాన్స్ మాస్టర్లు కొరియోగ్రఫీని, స్టంట్ మాస్టర్లు ఫైటింగ్ సీన్లను క్రియేట్ చేస్తారు. దీంతో పాటు చిరంజీవి మూవీ అంటే ఇక పాటలకు ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా పాటలు హిట్ అవ్వాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ టాలివుడ్ లో దుమ్ము లేపుతున్నాడు.
మరో కీలక అప్ డేట్...
ఇక చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కనపడుతుంది. విశ్వంభర మూవీ తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలో నటించడానికి సైన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి హైప్ క్రియేట్ అయింది. భారీగా బజ్ ఏర్పడటంతో అంచనాలు అందుకునేలా చిత్రీకరించడానికి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్రయూనిట్ రెడీ అవుతున్ననేపథ్యంలో మరొక కీలక అప్ డేట్ అందుతుంది.
ఇద్దరు హీరోయిన్లతో...
చిరంజీవి మూవీలో ఇప్పటికే వెంకటేశ్ నటిస్తారన్న ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోయినా ఇప్పుడు చిరంజీవి హీరోయిన్లుగా ఎవరు ఉంటారన్న దానిపై అనేక ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కాగా తాజాగా అందుతున్న వార్త ప్రకారం నయనతారను ఒక హీరోయిన్ గా ప్రధాన పాత్రలో తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి డిసైడ్ చేసినట్లు వైరల్ అవుతుంది. నయనతారతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండనుందని, శివశంకర్ ప్రసాద్ కు జోడీగా ఎవరు ఉంటారన్న ఆసక్తి మెగాఫ్యాన్స్ లో ఇప్పటికే మొదలయిన నేపథ్యంలో చిన్న ఫిల్లర్ ను చిత్ర యూనిట్ వదిలినట్లయింది. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Next Story