Tue May 06 2025 08:37:05 GMT+0530 (India Standard Time)
Sprit : "స్పిరిట్" పై అదిరిపోయే న్యూస్ ఇది.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్
ప్రభాస్ మూవీ అంటే చాలు ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. స్పిరిట్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ మూవీ అంటే చాలు ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రభాస్ లుక్ తో పాటు యాక్షన్, యాటిట్యూడ్ తో లక్షలాది మంది డార్లింగ్ కు వశమయ్యారు. ఎంతగా అంటే ప్రభాస్ సినిమాను థియేటర్ లోనే చూడాలన్నంతగా. అంతటి కసి ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉంటుంది. ప్రభాస్ ను అభిమానించే వారు కూడా 70mm సిల్వర్ స్క్రీన్ పై చూడాలని తెగ ఆరాటపడుతుంటారు. అదే ప్రభాస్ కు లభించిన బహుమతి అనుకోవాలి. ప్రభాస్ మూవీ హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఒకసారి చూసి వద్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది.
డైరెక్టర్లు క్యూ కడుతున్నా...
ప్రభాస్ తో సినిమా చేయడానికి నిర్మాతల నుంచి డైరెక్టర్ల వరకూ క్యూ కడుతుంటారు. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ తో మూవీ చేస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుందన్ననమ్మకం వారిలో ఉండటమే. ఎంతటి దర్శకుడైనా ఒకసారి ప్రభాస్ తో మూవీ తీయాలని తహతహలాడుతుంటారు. అందుకే ప్రభాస్ డైరీ పూర్తిగా నిండిపోయింది. వరస షూటింగ్ లో ఆయన పాల్గొన్నప్పటికీ రోజుకు ఇరవై నాలుగు గంటలు... ఏడాదికి 365 రోజులు సరిపోవు. అందుకే డార్లింగ్ ప్రభాస్ మూవీ కి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా చాలు అని భవావిస్తుంటారు. అది తెలుసుకుని తెగ ఆనందపడతారు.
రెండుమూడు నెలల్లో...
తాజాగా ఆయన నటించిన రాజాసాబ్ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత ప్రభాస్ సందీప్ వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకోవాల్సిన స్పిరిట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఈచిత్ర నిర్మాణ భూషణ్ కుమార్ మరో రెండు నెలల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని అధికారికంగా చెప్పారు. దీంతో రాజాసాబ్ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ లోనే పాల్గొంటారు. తర్వాత కల్కి 2లోనూ, తర్వాత సలార్ 2లోనూ నటించనున్నారు. ఇది ఫిక్స్. దీంతో సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించే మూవీ రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఈ మూవీపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది.
Next Story