Tue May 06 2025 09:07:20 GMT+0530 (India Standard Time)
Raja Saab : రాజాసాబ్ రిలీజ్ డేట్ ను పరోక్షంగా రివీల్ చేసిన డైరెక్టర్.. ఇది వింటే చాలు?
ప్రభాస్ హీరోగా, మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీ హార్రర్ అండ్ కామెడీగా ఉంటుందని ముందే రివీల్ చేశారు

డైరెక్టర్ మారుతి మూవీలంటే వెరైటీగా ఉంటాయి. అనేక సినిమాలు వైవిధ్యమైన కథలతో మారుతి ప్రేక్షకుల ముందుకు తెచ్చి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. టేకింగ్ నుంచి కథ, దర్శకత్వం వరకూ మారుతి అన్ని రకాలుగా వెరైటీగా సీన్స్ ను తెరకిక్కిస్తారన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మారుతి, నేచురల్ స్టార్ నాని తో తీసిన భలే భలే మగడావోయ్ మూవీలో మతిమరుపు ఉన్న హీరోతో సినిమాను రంజింపచేశాడు. పాటలుకూడా ఇందులో సూపర్ డూపర్ హిట్ కావడంతో్ నాని కెరీర్ లో భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మహానుభావుడు కూడా...
తర్వాత శర్వానంద్ తో కలసి మారుతి మరో మూవీ తీశాడు. ఈ సినిమాలో కూడా వెరైటీగా హీరోకి ఓసీడీ ఉన్నట్లు చూపించి ప్రేక్షకులను మెప్పించారు.శర్వానంద్ నటించిన మారుతి దర్శకత్వం వహించిన సినిమా మహానుభావుడు మూవీ 2017లో విడుదలైంది. ఈ మూవీ కూడా కొంత వెరైటీ గా భావించిన ప్రేక్షకులు ఆదరించారు. అయితే తాజాగా మారుతి - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తీస్తున్నమూవీపై కూడా ఇదే రకమైన అంచనాలున్నాయి. మరి ప్రభాస్ ను ఈ చిత్రంలో ఎలా చూపిస్తారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
బిగ్ అప్ డేట్...
ప్రభాస్ హీరోగా, మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీ హార్రర్ అండ్ కామెడీగా ఉంటుందని ముందే రివీల్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ ఏప్రిల్ పదోతేదీన విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు.కానీ తాజాగా మారుతి చేసిన కామెంట్స్ తో వచ్చే నెల విడుదలవుతుందని అర్థమవుతుంది. ఈ మూవీకి సంబంధించి రాజాసాబ్ లోని ఒక ఫొటో ఆటో పై ఉండటాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి ఆయన అలెర్ట్.. వేడిగాలులు మే నెలలో మరింత పెరగనున్నాయంటూ కాప్షన్ ఇవ్వడంతో మే నెలలో రాజాసాబ్ విడుదలవుతుందని మారుతి చెప్పకనే చెప్పినట్లయింది.
Next Story