Tue Jul 22 2025 03:15:30 GMT+0530 (India Standard Time)
Peddi : పెద్ది కోసం రామ్ చరణ్ కండలు పెంచేస్తున్నాడుగా
గ్లోబల్ స్టార్ రామచరణ్ నటించిన పెద్ది సినిమాపై భారీ అంచనాలున్నాయి.

గ్లోబల్ స్టార్ రామచరణ్ నటించిన పెద్ది సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఉప్పెన్ తో హిట్ అందుకున్న బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో విడుదలయిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దెబ్బతినడంతో పెద్ది మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ మూవీ పూర్తిగా గ్రామీణ ప్రాంతం బ్యాక్ గ్రౌండ్ లో చిత్రీకరణ చేస్తున్నారట. పెద్ది మూవీలో క్రీడాకారుడిగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.
మేకోవర్ అవుతున్న...
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, సంగీతం రెహమాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ముందు నుంచి హైప్ క్రియేట్ అయింది. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ అభిమానులను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.
వర్క్ అవుట్ చేస్తూ...
అయితే ఈ మూవీ కోసం రామ్ చరణ్ పెద్దిలో కనిపించేందుకు పెద్దగా కష్టపడుతున్నారట. ప్రధానంగా ఫిటెనెస్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ చరణ్ వర్క అవుట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోకు ఛేంజ్ ఓవర్ ఫర్ పెద్ది అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన హీరోను అలా చూసి పండగ చేసుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే రాజ్ కుమార్ ఫొటో కూడా ఆకట్టుకోవడంతో పెద్ది మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న అంచనాలున్నాయి.
Next Story