Tue May 06 2025 09:26:39 GMT+0530 (India Standard Time)
శర్వానంద్ మరో విన్నూత్న ప్రయోగం.. ప్రేక్షకులకు పండగేనట
హీరో శర్వానంద్ కొన్ని ఎంపిక చేసుకున్న సినిమాల్లోనే నటిస్తారు. వైవిధ్యభరితంగా ఉండే కథనాన్ని ఎంపిక చేసుకుంటారు.

హీరో శర్వానంద్ కొన్ని ఎంపిక చేసుకున్న సినిమాల్లోనే నటిస్తారు. వైవిధ్యభరితంగా ఉండే కథనాన్ని ఎంపిక చేసుకుంటారు. ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని కోరుకుంటారు. వారిని అలరించేందుకు పాత చింతకాయ పచ్చడి స్టోరీ లాంటిది కాకుండా ఏదో రకమైన విభిన్నమైన కథకాన్ని ఎంచుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని శర్వానంద్ నమ్ముతారు. ఆ నమ్మకంతోనే ఇప్పటి వరకూ చాలా మూవీలు చేశారు. మహానుభావుడు అలంటి కోవలోనిదే. అలాగే ఒకే ఇక జీవితం సినిమా కూడా విభిన్నంగా రూపొందించిందే. అందులో అమ్మ పాత్రలో అమల ఇమిడిపోగా, శర్వానంద్ కొడుకుగా అలరించాడు.
తొలిసారి పాన్ ఇండియా...
అయితే తాజాగా శర్వానంద్ తొలిసారి పాన్ ఇండియా మూవీని చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ఈ మూవీలో శర్వానంద్ కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. వీరిద్దరి జోడీ శతమానం భవతితో గతంలో అందరి మనసులను హత్తుకున్న సంగతి తెలిసిందే. తిరిగి ఈ చిత్రంలో కూడా శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ కలసి నటిస్తుండటంతో కొంత హైప్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.
1960వ నాటి...
అయితే ఈ చిత్రం కథనాన్ని కూడా కొద్దిగా మేకర్స్ రివీల్ చేశారు. 1960 సంవత్సరంలో జరిగిన కథ ఇది. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగే కథగా దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర ఎంత బలమైనదో.. అనుపమ పరమేశ్వర్ ను కూడా అంతే కీలకమని, ఇద్దరూ స్క్రీన్ స్పే్ బాగా పంచుకుని ప్రేక్షకులను బాగా అలరించగలరన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. శర్వానంద్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తయారయ్యాడని చెబుతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సంగీతం భీమ్స్ అందించనున్నారు.
Next Story