Sat Mar 21 2026 16:15:27 GMT+0530 (India Standard Time)
సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం
సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం నెలకొంది.

సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈరోజు ఉదయం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు వయసు ఎనభై ఐదేళ్లు ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో...
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మధురానగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వయోభారంతో ఆరోగ్యం క్షీణించడమే మరణానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శివాజీ రాజా తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు
Next Story

