Tue May 06 2025 09:44:38 GMT+0530 (India Standard Time)
Junior Ntr : పదిహేను రోజులు వెయిటింగ్ అంటే..చాలా కష్టం తారక్
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రెండు మూవీల్లో నటిస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎనర్జీతో పాటు హ్యుమానిటీ ఉన్న హ్యూమన్ బీయింగ్ అని అంటారు. నందమూరి వంశంలో అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగా ఆయది భోళా మనస్తత్వం అని చెబుతారు. హిట్ ను, ప్లాప్ ను ఒకేలా తీసుకుంటారు. అదేసమయంలో తన ఫ్యాన్స్ విషయంలో కూడా చాలా అలెర్ట్ గా ఉంటారు. ఫ్యాన్స్ ఇబ్బంది పడకూడదని ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా రద్దు చేసుకున్నారు. ఇక ఆపదలో ఉన్న తన అభిమానులను వెనువెంటనే ఆదుకుని ప్రాణాలు కాపాడేందుకు ముందుంటారు యంగ్ టైగర్. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మూవీ అంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు..అందరి ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఆయనను అభిమానించే వాళ్లలో అన్ని వర్గాల వారున్నారు.
రెండు చిత్రాలకు సంబంధించి...
RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో నూ అభిమానులు ఎక్కువ. వరస సక్సెస్ లతో జూనియర్ ఊపు మీదున్నాడు. తారక్ నటించిన దేవర సూపర్ డూపర్ హిట్ అయింది. దేవర 2 కూడా ఉంటుందని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ నెల 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఎలాంటి అప్ డేట్ అందుతుందోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రెండు మూవీల్లో నటిస్తున్నాడు. ఒకటివార్ 2 కాగా, రెండోది డ్రాగన్.డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుడంతో ముందుగానే ఈ చిత్రానికి ఊహించని విధంగా హైప్ క్రియేట్ అయింది.
పుట్టిన రోజు నాడు...
అయితే డ్రాగన్ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ యంగ్ టైగర్ అభిమానులకు తీపి కబురు అందించారు. పుట్టినరోజుకు పదిహేను రోజుల ముందుగానే ఈ కబురు అందడంతో తారక్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ నెల 20వ తేదీన డ్రాగన్ మూవీస్ కు సంబంధించి గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామనిమైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దీంతో పాటు బాలీవుడ్ లో తారక్ తొలిసారి నటిస్తున్న వార్ 2చిత్రానికి సంబంధించి కూడా ఫ్యాన్స్ కు అదిరిపోయో న్యూస్ వచ్చేసింది. ఈ మూవీలో హృతిక్ రోహన్, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు ఈ చిత్రానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను కూడా ఈ నెల ఇరవై తేదీన విడుదల చేస్తామని చెప్పడంతో తారక్ అభిమానులకు ఒకే రోజు రెండు గుడ్ న్యూస్ లు అందుతాయి. వీటికోసం మరో పదిహేను రోజులు వెయిట్ చేయాల్సిందే.
Next Story