Fri Mar 20 2026 01:38:10 GMT+0530 (India Standard Time)
Ustad Bhagath Singh : ఉగాది రోజున ఉస్తాద్ అలరించాడా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. హరీశ్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో పవన్ కల్యాణ్ ఖాతాలో మరో సూపర్ హిట్టు పడనుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి. ఈ సినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. కొంత ఆలస్యంగా ముందుకు వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్ నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందన్న టాక్ వచ్చింది.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో...
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనం ఏమీ లేకపోయినా పవన్ కల్యాణ్ ను స్క్రీన్ పై చూడటంతో ఆయన ఫ్యాన్స్ కు నిజంగా పూనకాలే వచ్చాయి. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో కొంత హరీశ్ శంకర్ పవన్ ఫ్యాన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశారు. కొన్ని సీన్లను ఆసక్తికరంగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. ప్రధానంగా రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలోనే ఆయనను హతమార్చిన సీన్ మరింతగా క్రేజ్ ను పెంచింది.
పవన్ నటన హైలెట్...
ఉస్తాద్ భగత్ సింగ్ కు, ముఖ్యమంత్రికి బాల్యం నుంచి ఉన్న అనుబంధంతో పాటు కధ మొత్తం చివర వరకూ కుర్చీల నుంచి కదలనివ్వకుండా చేసిందంటున్నారు. పవన్ కల్యాణ్ నటనకు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అన్ని పాత్రలు సమయోచితంగా కనిపించడంతో టెక్నికల్ గా కూడా ఈ మూవీ అందరినీ అలరించిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ సినిమా స్కోరు కూడా కూడా అలరించింది. ఫస్ట్ హాఫ్ కొంత బోరు అనిపించిందని, సెకండాఫ్ మాత్రం బాగా అలరించిందన్న టాక్ థియేటర్లలో వినిపిస్తుంది. మొత్తం మీద ఉస్తాద్ ఉగాది నాడు ఫ్యాన్స్ కు ఆరు రుచుల పచ్చడిని అందిచినట్లే.
Next Story

