Tue Jul 22 2025 02:59:53 GMT+0530 (India Standard Time)
గాల్లో మంటలు.. విమానంలో ఎంతమంది ఉన్నారంటే?
మరో విమానానికి ప్రమాదం తప్పింది. గాల్లోకి ఉండగానే విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

మరో విమానానికి ప్రమాదం తప్పింది. గాల్లోకి ఉండగానే విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. లాస్ ఏంజెల్స్ నుంచి అట్లాంటాకు వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్ విమానంలో పైలట్లు అప్రమత్తమయ్యారు. వెంటనే వెనక్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే...
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే వెంటనే పైలట్లు ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం అందించి సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు
Next Story